The OG Boys : ‘ది OG బాయ్స్’.. పవర్ స్టార్ తో స్పెషల్ ఫొటో వైరల్.. ఇందులో పవన్ ని గమనించారా..?
పవన్ కళ్యాణ్ తో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ డైరెక్టర్ సుజీత్ దిగిన స్పెషల్ ఫోటో వైరల్ గా మారింది. (The OG Boys)

The OG Boys
The OG Boys : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఫ్యాన్స్, ప్రేక్షకులు, సినిమా లవర్స్ ఈ సినిమా ఎప్పుడు చూద్దామా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్, గ్లింప్స్ తోనే సినిమా హైప్ ఆకాశాన్ని అంటింది. మూవీ యూనిట్ కూడా డైరెక్ట్ ప్రమోషన్స్ చేయకుండా పోస్టర్స్, ఫొటోలు రిలీజ్ చేస్తూ మెల్లిగా సినిమాపై మరింత హైప్ పెంచుతుంది.(The OG Boys)
ఇటీవలే OG సినిమా షూటింగ్ పూర్తవగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా సెప్టెంబర్ 25 రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా మూవీ యూనిట్ ఈ స్పెషల్ ఫోటో రిలీజ్ చేసారు. ఈ ఫొటోలో OG బాయ్స్ పవన్ కళ్యాణ్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, డైరెక్టర్ సుజీత్ ఉన్నారు. తమన్, సుజీత్ ఇద్దరి మీద చేతులు వేసి పవన్ మధ్యలో నిల్చొని నవ్వుతున్నారు. దీంతో ఈ ఫోటో వైరల్ గా మారింది.
Also Read : Manchu Manoj Vishnu : పాపం మనోజ్, విష్ణు.. అన్న తమ్ముళ్ళని కొట్టిన టీచర్.. దాంతో వీళ్ళిద్దరూ ఏం చేశారంటే..
ఇక ఈ ఫొటోని సరిగ్గా గమనిస్తే పవన్ కళ్యాణ్ OG హుడీ వేసుకున్నారు. పవన్ ఇలా ఒక సినిమాను ప్రమోట్ చేస్తూ ఆ సినిమా షర్ట్ వేసుకోవడం ఇదే మొదటిసారి. సాధారణంగా ఫ్యాన్స్, మూవీ యూనిట్ ఇలా మూవీ టైటిల్ ఉన్న షర్ట్స్ వేస్తారు. ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ OG షర్ట్ వేయడంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. ఇప్పటికే OG షర్ట్స్ కి బయట డిమాండ్ ఉంది. ఇప్పుడు పవన్ వేయడంతో ఈ డిమాండ్ మరింత పెరగడం ఖాయం.
Million dollar picture 🥹🔥#OG #TheyCallHimOG pic.twitter.com/AqlFrNnJcD
— DVV Entertainment (@DVVMovies) September 14, 2025