Manchu Manoj Vishnu : పాపం మనోజ్, విష్ణు.. అన్న తమ్ముళ్ళని కొట్టిన టీచర్.. దాంతో వీళ్ళిద్దరూ ఏం చేశారంటే..
మిరాయ్ ప్రమోషన్స్ లో భాగంగా మనోజ్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చిన్నప్పుడు జరిగిన ఆసక్తికర విషయం తెలిపాడు. (Manchu Manoj Vishnu)

Manchu Manoj Vishnu
Manchu Manoj Vishnu : ఇటీవల మంచు ఫ్యామిలిలో గొడవలు వచ్చిన సంగతి తెలిసిందే. మంచు మనోజ్ ఒకవైపు, మంచు ఫ్యామిలీ అంతా ఒక వైపు అయ్యారు. ఈ గొడవలు పోలీస్ స్టేషన్ వరకు కూడా వెళ్లాయి. ఇక మనోజ్ – విష్ణు మధ్య విబేధాలు బాగానే వచ్చాయని అర్థమయ్యాయి. ఇద్దరూ ఒకరిపై ఒకరి కామెంట్స్ చేసారు, పోస్టులు పెట్టారు. కానీ ఇప్పుడు ఇద్దరూ కూల్ అయ్యారు.(Manchu Manoj Vishnu)
ఇటీవల విష్ణు కన్నప్ప సినిమాతో వచ్చాడు. మనోజ్ తాజాగా మిరాయ్ సినిమాతో ప్రేక్షకుల ముందు వచ్చాడు. ఈ రెండు సినిమాలకు ఒకరికోరు విషెష్ చెప్పుకోవడంతో వీరి మధ్య మనస్పర్థలు తొలిగిపోయాయేమో అని అనుకుంటున్నారు. అయితే తాజాగా మిరాయ్ ప్రమోషన్స్ లో భాగంగా మనోజ్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చిన్నప్పుడు జరిగిన ఆసక్తికర విషయం తెలిపాడు.
మంచు మనోజ్ చిన్నప్పుడు జరిగిన సంఘటన గురించి మాట్లాడుతూ.. స్కూల్ లో యాక్టర్స్ కిడ్స్ ని చాలా టార్గెట్ చేస్తారు. స్టూడెంట్స్ మీ నాన్న హీరో కదరా అని ఏడిపిస్తారు. ఇక టీచర్స్ అయితే మీ నాన్న హీరో అని రెచ్చిపోతున్నావా అంటూ కొట్టేవాళ్ళు, టార్గెట్ చేసేవాళ్ళు. మా ఫ్రెంఛ్ టీచర్ మమ్మల్ని ఎక్కువ కొట్టేవాడు. మేము హాస్టల్ లో ఉండేవాళ్ళం. నేను తప్పు చేస్తే మా అన్నని పిలిచి అందరి ముందు కొట్టేవాడు. మా అన్న తప్పు చేస్తే నన్ను వాళ్ళ క్లాస్ రూమ్ కి తీసుకెళ్లి కొట్టేవాడు. ఇంకో బ్రదర్స్ కి కూడా అలాగే అయింది. మా తర్వాత వాళ్ళను అలా కొట్టేసరికి మేము అందరం మాట్లాడుకొని వెళ్లి ఫ్రెంచ్ టీచర్ మీద పడి కొట్టేసాం అని తెలిపాడు.