Pawan Kalyan : చిరంజీవి, వెంకయ్యనాయుడులతో పాటు పద్మ అవార్డు గ్రహీతలకు పవన్ కల్యాణ్ అభినందనలు

'పద్మవిభూషణ్' పురస్కారానికి ఎంపికైన మెగాస్టార్ చిరంజీవి, వెంకయ్యనాయుడులకి పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. పద్మ అవార్డు గ్రహీతలకు అభినందనలు చెప్పారు.

Pawan Kalyan

Pawan Kalyan : ‘పద్మవిభూషణ్’ పురస్కారానికి ఎంపికైన మెగాస్టార్ చిరంజీవికి, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు జనసేన అధిపతి పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. పద్మ పురస్కారాలకు ఎంపికైన వారందరికి పవన్ అభినందనలు చెప్పారు.

75వ గణతంత్ర దినోత్సవ వేళ కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. మెగాస్టార్ చిరంజీవి, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడులను ‘పద్మవిభూషణ్’ వరించగా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి కళా, సాహిత్య రంగాల నుండి పలువురు పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికయ్యారు. వీరందరికీ  సోషల్ మీడియాలో ప్రత్యేక లేఖ ద్వారా పవన్ శుభాకాంక్షలు చెప్పారు.

Today HeadLines : పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు తెలుగు రాష్ట్రాల సీఎంలు అభినందనలు

తన అన్నయ్య, ప్రముఖ నటుడు చిరంజీవికి ‘పద్మవిభూషణ్’ పురస్కారం దక్కడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని పవన్ అన్నారు. నటనలోకి ఎంతో తపనతో అడుగుపెట్టిన అన్నయ్య తనకు వచ్చిన ప్రతి పాత్రను, చిత్రాన్ని మనసు పెట్టి చేశారని.. కాబట్టే ప్రేక్షక హృదయాలను గెలుచుకున్నారని చెప్పారు. సామాజిక సేవా రంగంలో అన్నయ్య చిరంజీవి చేస్తున్న సేవలు ఆదర్శంగా నిలిచాయని పవన్ పేర్కొన్నారు.

వెంకయ్యనాయుడు ‘పద్మవిభూషణ్’ పురస్కారానికి ఎంపిక కావడం ముదావహమని.. విద్యార్ధి నాయకుడు దశ నుండి ఉప రాష్ట్రపతి స్ధాయికి ఎదిగిన వెంకయ్యనాయుడుగారు సుదీర్ఘ కాలం ప్రజా జీవితంలో ఉన్నారని పవన్ అన్నారు. ఆయన వాగ్ధాటి, తెలుగు భాషపై ఉన్న పట్టు అసామాన్యమైనవని, కేంద్రమంత్రిగా విశేషమైన సేవలందించారని పవన్ కొనియాడారు. ఆంధ్రప్రదేశ్  మచిలీపట్నానికి చెందిన హరికథ కళాకారిణి శ్రీమతి ఉమా మహేశ్వరిగారు, తెలంగాణ రాష్ట్రం నుంచి చిందు యక్ష గాన కళాకారుడు శ్రీ గడ్డం సమ్మయ్య గారు, స్థపతి శ్రీ వేలు ఆనంద చారి గారు, బుర్ర వీణ వాయిద్యకారుడు శ్రీదాసరి కొండప్పగారు, సాహిత్య విభాగం నుంచి  శ్రీ కేతావర్ సోంలాల్ గారు, శ్రీ కూరెళ్ల విఠలాచార్య గారు పద్మశ్రీ పురస్కారాలను అందుకోవడం ఆనందదాయకమని పవన్ అన్నారు.

వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్

పద్మశ్రీ పురస్కారాలు ఎంపిక విషయంలో ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం ప్రశంసనీయమని.. వివిధ రంగాల్లో స్ఫూర్తిదాయకమైన సేవలు చేస్తూ అన్సంగ్  హీరోస్‌గా ఉన్నవారిని గుర్తించి పద్మ అవార్డులు ఇస్తున్నారని పవన్ అన్నారు.

ట్రెండింగ్ వార్తలు