జస్ట్ టైమ్ గ్యాప్ అంతే.. పవన్ కళ్యాణ్ బర్త్ డే ట్రెండింగ్ రికార్డ్..

  • Published By: sekhar ,Published On : July 15, 2020 / 12:22 PM IST
జస్ట్ టైమ్ గ్యాప్ అంతే.. పవన్ కళ్యాణ్ బర్త్ డే ట్రెండింగ్ రికార్డ్..

Updated On : July 15, 2020 / 1:53 PM IST

టాలీవుడ్ టాప్ హీరోల్లో జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యుకంగా చెప్పక్కర్లేదు. కొంతకాలం రాజ‌కీయాల్లో బిజీగా ఉండి సినిమాల‌నుంచి కాస్త బ్రేక్ తీసుకున్న పవన్ ‘వకీల్‌ సాబ్‌’తో రీ ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇది అయ‌న అభిమానుల‌కు సంతోష‌క‌ర‌మైన వార్త అనే చెప్పాలి.

 Pawan Kalyan

సెప్టెంబ‌ర్ 2న ప‌వ‌న్‌క‌ల్యాణ్ పుట్టిన‌రోజు. నెల‌న్న‌ర‌కు పైగానే స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ అభిమానులు మాత్రం సోష‌ల్ మీడియాలో ఇప్పుడే సంద‌డి మొద‌లెట్టేశారు.#AdvanceHBDPawanKalyan అనే హ్యాష్ ట్యాగ్‌ను క్రియేట్ చేసి ట్విట్ట‌ర్‌లో ట్రెండ్ చేశారు.

 Pawan Kalyan

దేశంలోనే ట్విట్ట‌ర్ ట్రెండింగ్ స్టార్‌గా ప‌వ‌న్ క‌ల్యాణ్ పేరిట రికార్డ్ క్రియేట్ చేశారు ఫ్యాన్స్. 24 గంట‌ల్లోనే ఈ హ్యాష్ ట్యాగ్‌తో 27.3 మిలియ‌న్స్ ట్వీట్స్ వ‌చ్చాయంటే అభిమానుల ఏ రేంజ్‌లో చేల‌రేగిపోయారో అర్థం చేసుకోవ‌చ్చు. ‘వకీల్ సాబ్’ తర్వాత క్రిష్ దర్శకత్వం వహించబోయే సినిమాలో నటించనున్నాడు పవర్ స్టార్..