Ustaad Bhagat Singh : ఎన్నికల బిజీలో ఉన్నా.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ డబ్బింగ్‌కి పవన్.. ఆ డేట్‌కి పొలిటికల్ గ్లింప్స్ రిలీజ్?
నేడు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ కి డబ్బింగ్ చెప్తున్న ఫోటోలని తమ సోషల్ మీడియాలో షేర్ చేసారు మూవీ యూనిట్.
- Saketh U
- Published On : March 17, 2024 / 12:15 PM IST
Pawan Kalyan Dubbing Work to Ustaad Bhagat Singh Photos Goes Viral
Ustaad Bhagat Singh : హరీష్ శంకర్(Harish Shankar) దర్శకత్వంలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా రెండేళ్ల క్రితం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని ప్రకటించారు. కానీ పవన్ రాజకీయ షెడ్యూల్స్ వల్ల ఈ సినిమాకి డేట్స్ ఇవ్వలేకపోయారు. దీంతో హరీష్ ఈ సినిమాని పక్కన పెట్టి రవితేజతో మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్నాడు. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ ఆల్రెడీ ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా జరుపుకుంది. ఈ సినిమా నుంచి ఒక గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు.
ఈ సినిమా పక్కన పెట్టేయడంతో అభిమానులు కూడా ఈ సినిమాపై ఆశలు వదులుకున్నారు. ఎన్నికలు అయ్యాకే ఈ సినిమా ఉండొచ్చు అని ఫిక్స్ అయ్యారు. కానీ నిన్న సడెన్ గా ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి అప్డేట్ రాబోతుందని మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించడంతో పవన్ అభిమానులు ఆశ్చర్యపోయారు. ఇక నేడు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ కి డబ్బింగ్ చెప్తున్న ఫోటోలని తమ సోషల్ మీడియాలో షేర్ చేసారు మూవీ యూనిట్. పక్కన హరీష్ శంకర్ ఉండి పవన్ తో డబ్బింగ్ చెప్పిస్తున్నారు.
Also Read : Karthikeya 3 : ‘కార్తికేయ 3’ పక్కా ఉంది.. అప్డేట్ ఇచ్చిన నిఖిల్.. త్వరలోనే కొత్త అడ్వెంచర్..
మార్చ్ 19న ఈ సినిమాకు సంబంధించిన ఓ గ్లింప్స్ రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. పవన్ పొలిటికల్ కి ఉపయోగపడేలా, పొలిటిల్ డైలాగ్స్ తో ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ ఉండబోతున్నట్టు సమాచారం. దీంతో మరో రెండు రోజుల్లో రాబోయే ఈ గ్లింప్స్ కోసం పవన్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా షూట్ మాత్రం ఎన్నికలు అయ్యాకే ఉంటుంది. ఇప్పుడు కేవలం పొలిటికల్ గా ఉపయోగపడటానికి ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేస్తున్నారని సమాచారం. ఇక పవన్ డబ్బింగ్ చెప్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Expect the unexpected ?
19th March ❤️?❤️?❤️?#UstaadBhagatSingh pic.twitter.com/JZfYC5en6y
— Mythri Movie Makers (@MythriOfficial) March 17, 2024
