Pawan Kalyan
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న OG సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కానుంది. ఇటీవల ఆదివారమే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా చేయగా పవన్ కళ్యాణ్ వచ్చి ఫ్యాన్స్ ని ఉర్రూతలాడించాడు. ఆ తర్వాత మళ్ళీ డిప్యూటీ సీఎంగా ఏపీ ప్రభుత్వ పనులతో బిజీ అయ్యారు. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటున్నారు పవన్ కళ్యాణ్.
అయితే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ బారినపడ్డారు. గత రెండు రోజులుగా పవన్ కళ్యాణ్ జ్వరంతో ఇబ్బందిపడుతున్నారు. జ్వరంతోనే నిన్న సోమవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు, అధికారులతో సమీక్షలు నిర్వహించారు. సోమవారం రాత్రి నుంచి జ్వరం తీవ్రత మరింత పెరిగింది. ఈ క్రమంలో వైద్యులు పరీక్షలు చేసి చికిత్స అందించి విశ్రాంతి అవసరమని సూచించారు.
ఓ పక్క జ్వరంతో ఇబ్బందిపడుతూనే పవన్ కళ్యాణ్ తన శాఖాపరమైన విషయాలపై అధికారులతో టెలీ కాన్ఫరెన్సులు నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ సినిమాల పీఆర్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఓ పక్క అసెంబ్లీ సమావేశాలు, మరో పక్క OG రిలీజ్ ఉండటం.. ఇలాంటి సమయంలో పవన్ వైరల్ ఫీవర్ బారిన పడటంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వైరల్ ఫీవర్ బారినపడ్డారు.
శ్రీ పవన్ కళ్యాణ్ గారికి గత రెండు రోజులుగా జ్వరంతో ఇబ్బందిపడుతున్నారు. జ్వరంతోనే సోమవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు, అధికారులతో సమీక్షలు నిర్వహించారు.
సోమవారం రాత్రి నుంచి జ్వరం తీవ్రత పెరిగింది. ఈ…— L.VENUGOPAL🌞 (@venupro) September 23, 2025