OG Theatrical Business : OG ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? పవన్ కెరీర్ లోనే హైయెస్ట్.. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎన్ని కోట్లు కలెక్ట్ చేయాలి..

పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ OG సినిమాకు జరిగింది. (OG Theatrical Business)

OG Theatrical Business : OG ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? పవన్ కెరీర్ లోనే హైయెస్ట్.. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎన్ని కోట్లు కలెక్ట్ చేయాలి..

OG Theatrical Business

Updated On : September 23, 2025 / 5:34 PM IST

OG Theatrical Business : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కానుంది. ఈ సినిమాపై భారీ హైప్ ఉన్న సంగతి తెలిసిందే. నిన్న రిలీజ్ చేసిన ట్రైలర్ తో మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఆన్లైన్ బుకింగ్స్ ఓపెన్ చేయగా అన్ని హౌస్ ఫుల్స్ అయిపోయాయి. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఆల్మోస్ట్ 50 కోట్ల గ్రాస్ వసూలు చేసింది OG సినిమా. OG సినిమాపై ఉన్న హైప్ తో ఈ సినిమాకు భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.(OG Theatrical Business)

పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ OG సినిమాకు జరిగింది. టాలీవుడ్ సమాచారం ప్రకారం OG సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్..

Also Read : OG Bookings : వామ్మో ఇదెక్కడి హైప్ రా బాబు.. ఒక్క సిటీలో 550 షోలు హౌస్ ఫుల్.. రిలీజ్ కి రెండు రోజుల ముందే..

OG సినిమా నైజాంలో – 54 కోట్లు, సీడెడ్ – 22 కోట్లు, ఉత్తరాంధ్ర – 20 కోట్లు, ఈస్ట్ – 12 కోట్లు, వెస్ట్ – 9 కోట్లు, గుంటూరు – 12 కోట్లు, కృష్ణ – 9 కోట్లు, నెల్లూరు – 6 కోట్లు.. మొత్తంగా ఆంధ్ర, తెలంగాణ కలిపి 144 కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యాయి.

మిగతా ఇండియా మొత్తానికి దాదాపు 10 కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యాయి.
ఓవర్సీస్ రైట్స్ – 17 కోట్లకు అమ్ముడయ్యాయి.

Also Read : Sujeeth : సుజీత్ చెప్పిన వెబ్ సైట్ ఓపెన్ చేశారా? అందులో ఏముంది? ఏం కంటెంట్ ఇస్తాడు? OG ప్రీక్వెల్..?

మొత్తంగా OG సినిమా ప్రపంచవ్యాప్తంగా 171 కోట్లకు థియేట్రికల్ రైట్స్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇది పవన్ కెరీర్ లోనే భారీ మొత్తం. ఈ లెక్కన OG సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం 175 కోట్ల షేర్ కలెక్షన్స్ రాబట్టాలి. అంటే ఆల్మోస్ట్ 350 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టాలి.

ఈ సినిమాకు ఉన్న హైప్, ఇప్పటికే అడ్వాన్స్ సేల్స్ తో 50 కోట్లు రావడం, దసరా హాలిడేస్ ఉండటం, టికెట్ రేట్లు పెరగడంతో సినిమాకు కలిసొచ్చి ఈజీగా బ్రేక్ ఈవెన్ అవుతుందని భావిస్తున్నారు. ఇక OG సినిమా 500 కోట్లు కలెక్ట్ చేస్తుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. ఈ సినిమా పవన్ కెరీర్ లోనే మొదటి 100 కోట్ల షేర్ సినిమా కూడా అవుతుందని అంటున్నారు. మొత్తానికి OG సినిమా భారీగానే థియేటర్స్ నుంచి రాబట్టాల్సి ఉంది.