Pawan Kalyan Fans
Pawan Kalyan Fans – Bro Movie : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ విశాఖలోని జగదాంబ థియేటర్లో హంగామా చేశారు. పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) నటించిన ‘బ్రో’(Bro) సినిమా ట్రైలర్ ఇవాళ విడుదలైన విషయం తెలిసిందే.
ఆ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో జగదాంబ థియేటర్ వద్ద ఫ్యాన్స్ హల్‌చల్ చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. జగదాంబ థియేటర్‌లో ఫ్యాన్స్ అద్దాలను పగులగొట్టారు.
తెలుగు రాష్ట్రాల్లోని మరికొన్ని థియేటర్ల వద్ద పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ డ్యాన్సులు చేస్తూ, పటాకులు కాల్చుతూ అంబరాన్నంటే ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. బ్రో సినిమాకు సముద్ర ఖని దర్శకత్వం వహించారు.
సోషియో ఫాంటసీగా ఈ సినిమా రూపుదిద్దుకుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమాకు థమన్ బాణీలు సమకూర్చారు. ఈ నెల 28న ఈ సినిమా విడుదల కానుంది. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అప్పుడే ఈ పండుగ హడావుడి మొదలుపెట్టేశారు.
పలు థియేటర్ల వద్ద ఫ్యాన్స్ డ్యాన్సులు..
Started ?⚡#BroTrailer #BroTheAvatar pic.twitter.com/vuobGCELYJ
— . (@Teledhu__) July 22, 2023
Electricfy atmosphere at Devi70mm
??#BroTheAvatar pic.twitter.com/kAZEqdynnE— തരുൺ കല്യാണ് ? (@TaRuNKaLyAn16) July 22, 2023
#BroTheAvatar Madness ??? pic.twitter.com/MIh31B6yUk
— ???????? ????? (@BheeshmaTalks) July 22, 2023
Fan Girl at at Devi 70mm ??#BroTheAvatar #BroTrailer pic.twitter.com/2pVNjrtFlM
— PawanKalyan Army (@PawanKalyanArmy) July 22, 2023