Pk
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా అభిమానులని సంపాదించుకున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో పవన్ ఫ్యాన్ బేస్ ఎక్కువే. పవన్ ఎక్కడికి వెళ్లినా జనాలు గుమిగూడతారు. ఇక పవన్ అభిమానులు పవన్ కళ్యాణ్ ఎక్కడికి వచ్చినా పవర్ స్టార్, పవర్ స్టార్, సీఎం, సీఎం అంటూ అరుస్తారు. వేరే హీరోల సినిమా ఫంక్షన్స్ లోను ఇలా అరుస్తారు. కొన్ని సందర్భాలలో దీని వల్ల చాలా మంది అసహనం వ్యక్తం చేసారు. అభిమానం ఉండటంలో తప్పు లేదు కానీ ఇలాంటి వెర్రి అభిమానం వల్ల పక్కన వాళ్ళు ఇబ్బందులు పడ్డ సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇంకా చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్ కి ఆయన అభిమానులే మైనస్ అవుతున్నారు. చాలా మందికి ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో తెలీదు. ఈ విషయం చాలా మంది డైరెక్ట్ గానే చెప్పారు. పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయంలో రెండు, మూడు సార్లు సీరియస్ అయ్యారు అభిమానుల మీద అయినా అభిమానుల తీరు మారలేదు. మరో సారి అభిమానుల మీద సీరియస్ అయ్యాడు పవన్.
Nyattu Remake : మరో మలయాళం రీమేక్… పోలీసు పాత్రల్లో ప్రియదర్శి, అంజలి
నిన్న ఆదివారం విశాఖ ఉక్కుకి సపోర్ట్ గా పవన్ కళ్యాణ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో మీటింగ్ ఏర్పాటు చేశారు. దీనికి వివిధ పార్టీల నేతలు, కార్మిక సంఘాలు కూడా పాల్గొన్నాయి. వీళ్ళతో పాటు అభిమానులు కూడా వచ్చారు. ఒక పక్క సీరియస్ గా మీటింగ్ జరుగుతుంటే మరో పక్క అభిమానులు పవర్ స్టార్… పవర్ స్టార్… సీఎం అంటూ గోల చేశారు. దీనిపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు సభా మర్యాద తెలియదా, పవర్ స్టార్ అని ఎందుకు అరుస్తున్నారు. మీ మెదడులను పెంచుకోండి, నన్ను పవర్ స్టార్ అని పిలవడం మానేయండి అంటూ అభిమానుల మీద సీరియస్ అయ్యాడు.
Rajinikanth : హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన సూపర్ స్టార్
ఇటీవల రోడ్లను బాగు చేయాలి అంటూ చేసిన ఓ ఉద్యమ మీటింగ్ లో కూడా ఇలాగే పవర్ స్టార్ అని అరిస్తే సీరియస్ అయి పవర్ లేనివాడు పవర్ స్టార్ కాదు, తనను జనసేనాని అని పిలవండి చాలు అని అన్నారు. తాను సరదాగా రాజకీయాలు చేయడం లేదు, బాధ్యతతో రాజకీయాలు చేస్తున్నాని ఇకపై ఇలా గోల చేయకండి అని పవన్ తెలిపారు. కానీ పవన్ అభిమానుల తీరు మాత్రం మారట్లేదు.