Pawan Kalyan forget his own cinema title video gone viral
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలు, ఇటు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. ఇక ఈ మధ్యలో కొన్ని ఈవెంట్స్ కి కూడా హాజరవుతూ అందర్నీ ఆనందపరుస్తూ వస్తున్నాడు. తాజాగా పవన్ కళ్యాణ్.. ఒక తెలుగు టీవీ ఛానల్ ఓపెనింగ్ కి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి వార్తలు కోసం ఆ ఛానల్ లాంచ్ అయ్యింది. ఇక ఈ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. సినిమా జర్నలిజం గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇక ఇదే వేదిక పై పవన్ మాట్లాడుతూ.. ‘నా సినిమాలు నిర్మిస్తున్న నిర్మాతల నుంచి మీ ఛానల్ కి నేను మద్దతు ఇస్తాను’ అంటూ పేర్కొన్నాడు. ఈక్రమంలోనే తన సినిమా నిర్మాతల పేర్లు చెబుతూ.. “వకీల్ సాబ్ దర్శకుడు దిల్ రాజు, సర్దార్ భగత్ సింగా ఏదో ఉంది సినిమా పేరు భగత్ సింగ్ అని గుర్తుంది. ఆ సినిమా నిర్మాత నవీన్ నుంచి అయితే మద్దతు ఉంటుంది” అని తెలియజేశాడు. పవన్ ఇలా తన సొంత సినిమా టైటిల్ నే మర్చిపోవడం నెట్టింట వైరల్ గా మారింది. ఇక దీని మీద నెటిజెన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు.
Also read : Lokesh Kanagaraj : లియో సినిమా దర్శకుడు లోకేష్ కనగరాజ్‌కి గాయాలు.. అభిమానుల వలనే..!
Sardar… Bhavadeeyudu…ahhh Ustadd?? kasepu aagi OG kuda anestadu?????#UstaadBhagatSingh #PawanKalyan pic.twitter.com/ECGeQcRBN7
— Siva Harsha (@SivaHarsha_23) October 24, 2023
ప్రస్తుతం జరుగుతున్న సినిమా జర్నలిజం గురించి మాట్లాడుతూ.. “సినిమా వారి గురించిన కాంట్రవర్సియల్ న్యూస్ మాత్రమే కాకుండా చలన చిత్రసీమలో ఎంతో మంది గొప్ప దర్శకులు, కళాకారులు ఉన్నారు వారి గురించి కూడా ప్రేక్షకులకు తెలియజేసేలా ఈ ఛానల్ పని చేయాలని కోరుకుంటున్నాను. అలాగే కొన్ని సున్నితమైన అంశాలోకి సినిమా పరిశ్రమ వ్యక్తులను లాగుతున్నప్పుడు మీరు వారికీ అండగా ఉండాలని కోరుకుంటున్నాను” అంటూ పవన్ వ్యాఖ్యానించాడు.