Pawan Kalyan
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఓ పక్కన ఏపీ ఉపముఖ్యమంత్రిగా మరో పక్కన తన సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల హరిహర వీరమల్లు సినిమాకు ఫుల్ ప్రమోషన్స్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు పవన్. ఆ ప్రమోషన్స్ లో పవన్ మాటలు, డ్రెస్ లు, వరుస ఇంటర్వ్యూలు అన్ని చూసి ఫ్యాన్స్ సైతం ఆశ్చర్యపోతూ సంతోషం వ్యక్తం చేసారు. ఈ క్రమంలో ఓ వీడియో లేటెస్ట్ గా వైరల్ అవుతుంది.
బాలీవుడ్ ఫోర్క్ మీడియా గ్రూప్ కి చెందిన హాటర్ ఫ్లై అనే సంస్థ పవన్ కళ్యాణ్ ని కొన్ని రోజుల క్రితం చేసిన సరదా ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇటీవల సెలబ్రిటీలను ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి అంటూ రాపిడ్ ఫైర్ ప్రశ్నలు అడుగుతున్న సంగతి తెలిసిందే.
Also Read : Mrunal Thakur : ‘డెకాయిట్’ సెట్ లో.. మృణాల్ ఠాకూర్ బర్త్ డే సెలబ్రేషన్స్..
అలా పవన్ కళ్యాణ్ కి హీరోయిన్స్ పేర్లు చెప్పి ఎవరో ఒకర్ని సెలెక్ట్ చేయాలి అన్నారు. మొదట అలియా భట్, దీపికా పదుకోన్ పేర్లు చెప్పి ఒకర్ని సెలెక్ట్ చేసుకోమంటే ఇద్దర్ని అన్నారు పవన్. అలియా భట్, దీపికా పదుకోన్, కృతి సనన్ పేర్లు చెప్పగా ముగ్గుర్ని సెలెక్ట్ చేసారు. అలియా భట్, దీపికా పదుకోన్, కృతి సనన్, కియారా అద్వానీ పేర్లు చెప్పగా కృతి సనన్ ని సెలెక్ట్ చేసారు. కృతి సనన్, కంగనా రనౌత్ పేర్లు చెప్పగా కంగనా అని చెప్పారు. కంగనా, ప్రియాంక చోప్రా పేర్లు చెప్పగా కంగనానే చెప్పారు. కంగనా, కరీనా అని అడగ్గా కంగనా చాలా స్ట్రాంగ్ పర్సన్, ఆమె ఇందిరా గాంధీ పాత్ర కూడా పోషించించింది.. కంగనానే అని తెలిపారు. చివరగా కంగనా, శ్రీదేవి అని అడగ్గా నవ్వుతూ శ్రీదేవి అని చెప్పారు.
అసలు పవన్ కళ్యాణ్ ఇంతలా నవ్వుతూ, ఇలా సరదాగా మాట్లాడుతూ ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్టు ఇలాంటి చిట్ చాట్ చేయడం చూసి ఆశ్చర్యపోతున్నారు. కొంతమంది అయితే ఇది పవన్ కళ్యాణేనా లేక ఏఐ వీడియోనా అని కామెంట్స్ చేస్తున్నారు. ఆ సంస్థ కామెంట్స్ లో ఛాన్స్ కుదిరింది అందుకే ఇలా సరదాగా చేసాము అని రిప్లై ఇచ్చింది. అయితే ఇంతటి సరదా వీడియో లేట్ గా వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసి ఫ్యాన్స్ ఇదెలా మిస్ అయ్యంరా బాబు అనుకుంటూ వైరల్ చేస్తున్నారు. ఈ వీడియో హరిహర వీరమల్లు ప్రమోషన్స్ సమయంలో విజయవాడ ఎయిర్ పోర్ట్ లో మీడియా సంస్థ రిక్వెస్ట్ చేయగా చిన్న గ్యాప్ లో చేసినట్టు తెలుస్తుంది. మీరు కూడా పవన్ కళ్యాణ్ సరదా చిట్ చాట్ చూసేయండి..
Also Read : Mayasabha : ‘మయసభ’ ట్రైలర్ రిలీజ్.. సాయి దుర్గ చేతుల మీదుగా.. ఇదేదో భారీ పొలిటికల్ సిరీస్ లా ఉందే..