Mayasabha : ‘మయసభ’ ట్రైలర్ రిలీజ్.. సాయి దుర్గ చేతుల మీదుగా.. ఇదేదో భారీ పొలిటికల్ సిరీస్ లా ఉందే..

మయసభ సిరీస్‌ ఆగస్ట్ 7 నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది.

Mayasabha : ‘మయసభ’ ట్రైలర్ రిలీజ్.. సాయి దుర్గ చేతుల మీదుగా..  ఇదేదో భారీ పొలిటికల్ సిరీస్ లా ఉందే..

Mayasabha Trailer

Updated On : July 31, 2025 / 8:29 PM IST

Mayasabha : దేవా కట్టా, కిరణ్ జయ కుమార్ దర్శకత్వంలో హిట్ మ్యాన్ అండ్ ప్రూడోస్ ప్రొడక్షన్స్ ఎల్.ఎల్.పి బ్యానర్స్‌పై విజయ్ కృష్ణ లింగమనేని, శ్రీహర్ష నిర్మాణంలో తెరకెక్కిన సిరీస్‌ మయసభ : రైజ్ ఆఫ్ ది టైటాన్స్. ఆది పినిశెట్టి, చైతన్య రావు మెయిన్ లీడ్స్ లో ఈ సిరీస్ తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సిరీస్ టీజర్ రిలీజ్ చేయగా తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించి ట్రైలర్ రిలీజ్ చేసారు. మయసభ సిరీస్‌ ఆగస్ట్ 7 నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. మీరు కూడా మయసభ ట్రైలర్ చూసేయండి..

ఈ ట్రైలర్ చూస్తుంటే.. ఏపీ రాజకీయాల్లో వైఎస్సార్, చంద్రబాబు నాయుడు ప్రస్థానం ఎలా మొదలైంది. స్నేహితులుగా వాళ్ళు ఎలా ఉండేవారు. ఎమెర్జెన్సీ సమయంలో ఏపీలో ఏం జరిగింది అని పొలిటికల్ గా కొన్ని అంశాలు తీసుకొని సినిమాటిక్ గా చూపించబోతున్నట్టు తెలుస్తుంది.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హీరో సాయి దుర్గ తేజ్ మాట్లాడుతూ.. దేవా గారితో నాది పదేళ్ల ప్రయాణం. ఆటోనగర్ సూర్య చూసిన వెంటనే దేవా గారికి ఫోన్ చేసాను. రిపబ్లిక్ టైంలో జరిగిన ఘటనలో నాకు దేవకట్టా అండగా నిలిచారు. ఓ మూడు పార్టులకు సరిపడా కథను రాశాను అని దేవా కట్టా గారు ‘మయసభ’ గురించి గతంలోనే చెప్పారు. ఆది, చైతన్య నాకు చాలా ఏళ్ల నుంచి తెలుసు. 30 వెడ్స్ 21 చూసి చైతన్యని చూపించి మా అమ్మ నన్ను పెళ్లి గురించి అడుగుతూ ఉండేవారు. అలా నా లైఫ్‌లో చైతన్య విలన్‌లా మారిపోయాడు. ఆది నేను కలిసి డ్యాన్స్, జిమ్నాస్టిక్ క్లాసులకు వెళ్ళేవాళ్ళం. మయసభ సిరీస్ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

Also Read : Kingdom : కింగ్డమ్ సక్సెస్ ఈవెంట్ అక్కడే.. ఎప్పుడంటే..?

దేవా కట్టా మాట్లాడుతూ.. మయసభ అనేది అందమైన ఊహ. ఇద్దరు ప్రాణ స్నేహితుల ప్రయాణమే ఈ కథ. పరిస్థితుల వల్ల వారిద్దరి మధ్య ఏర్పడిన దూరం ఏంటి అనే కాన్సెప్ట్‌తో తీశాం. శ్రీ హర్ష నా వద్దకు వచ్చి ఏపీ రాజకీయాల గురించి మాట్లాడారు. అప్పుడు మొదలైందే ఈ మయసభ. ముందు మూడు పార్టులుగా సినిమాకు కథ రాశాను. ఆ తరువాత ఇదే కథను ఓ సిరీస్‌లా ఓ సీజన్‌ను రాసుకున్నాను. స్కామ్, మహారాణి లాంటి ఎన్నో సెన్సేషనల్ సిరీస్‌లను సోనీ లివ్ అందించింది. సోనీ వాళ్లకు ఈ పాయింట్ నచ్చడంతో ఇలా ముందుకు వస్తుంది. కిరణ్ నాతో ఎన్నో ఏళ్ళ నుంచి ప్రయాణిస్తున్నారు. బాహుబలి, రిపబ్లిక్ టైంలోనూ ఆయన నాకు రైటింగ్ లో తోడు నిలిచారు. ఈ కథ అనుకున్న వెంటనే నాకు ఆది గుర్తుకు వచ్చారు. ఆదిని మ్యాచ్ చేసేందుకు చైతన్య కష్టపడ్డారు. ఈ ప్రాజెక్ట్ కోసం 264 మందిని తీసుకున్నాం అని తెలిపారు.

Mayasabha Trailer

సోనీ లివ్ బిజినెస్ హెడ్ ధనీష్ కాంజీ మాట్లాడుతూ.. కరోనా కంటే కాస్త ముందుగా మా ఓటీటీ సంస్థను ప్రారంభించాం. మన ఇండియన్ కథల్ని ప్రపంచ వ్యాప్తంగా చూపించాలని అనుకున్నాం. మొదట హిందీ, మలయాళంలో గొప్ప గొప్ప కథల్ని తెరకెక్కించాం. బృందాతో తెలుగులో మొదటి సిరీస్ చేశాం. ఇప్పుడు తెలుగులో ‘మయసభ’తో రాబోతున్నాం అని తెలిపారు. సోనీ లివ్ కంటెంట్ హెడ్ షోగత్ ముఖర్జీ మాట్లాడుతూ.. దేవా కట్టా గారు కథను ఎంత అందంగా నెరేట్ చేశారో అంతే అద్భుతంగా తీశారు. ఈ ప్రాజెక్ట్‌ కోసం దేవా కట్టా గారు మూడు, నాలుగేళ్ల సమయం తీసుకున్నారు అని అన్నారు.

Also See : Kingdom Success Meet : విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ సక్సెస్ మీట్ ఫొటోలు..

ఆది పినిశెట్టి మాట్లాడుతూ.. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ఉన్న ప్రాజెక్ట్ చేయాలని నాకు ఎప్పటి నుంచే ఉండేది. దేవా కట్టా గారు ‘మయసభ’ను అద్భుతంగా రాశారు. ప్రస్థానం, రిపబ్లిక్‌ లా మయసభ నిలిచిపోతుంది. రెండో సీజన్ కోసం నేను ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను అని అన్నారు. చైతన్య రావ్ మాట్లాడుతూ.. దేవా కట్టా గారు చేసిన ‘వెన్నెల’ నాకు చాలా ఇష్టం. ఇంత మంచి పాత్రను ఇచ్చిన ఆయనకు థాంక్స్. ఆదితో నటించడం ఛాలెంజింగ్‌గా అనిపించింది. నేను ఈ ఇండస్ట్రీలో ఉన్నంత వరకు ‘మయసభ’ ఎప్పటికీ ప్రత్యేకంగానే నిలుస్తుంది అని అన్నారు.