Hari Hara Veera Mallu : శివరాత్రికి ‘హరిహర వీరమల్లు’ స్పెషల్ ప్రోమో.. రిలీజ్ డేట్‌ని కూడా..

'హరిహర వీరమల్లు' స్పెషల్ ప్రోమో వచ్చేది అప్పుడే. అంతేకాదు మూవీ రిలీజ్ డేట్ కూడా..

Pawan Kalyan Hari Hara Veera Mallu promo and movie release date updates

Hari Hara Veera Mallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడో మొదలుపెట్టిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా మూవీ ‘హరిహర వీరమల్లు’. పవన్ వారియర్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని క్రిష్ డైరెక్ట్ చేస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంటే, బాబీ డియోల్ ఓ ముఖ్య పాత్ర చేస్తున్నారు. ఆల్రెడీ 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. పవన్ రాజకీయ షెడ్యూల్స్ వల్ల షూటింగ్ కి బ్రేక్ లు పడ్డాయి. ఈ మధ్యలో ఈ సినిమా నుంచి ఏ అప్డేట్ లేకపోవడంతో మూవీ పూర్తిగా ఆగిపోయింది అని కూడా అనుకున్నారు.

అయితే రీసెంట్ గా ఈ మూవీ నుంచి ‘త్వరలో ప్రోమో రాబోతుంది’ అంటూ ఓ అప్డేట్ రావడంతో.. మూవీ ఆగిపోలేదని తెలిసింది. కాగా ఈ ప్రోమోని శివరాత్రి సందర్భంగా మార్చి 8న రిలీజ్ చేసేందుకు మూవీ టీం సిద్దమవుతుందట. ఆ ప్రోమో గ్రాఫిక్స్ తో ఆకట్టుకునేలా ఉంటుందని సమాచారం. ఇక ఇదే ప్రోమోతో రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేయబోతున్నారట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఈ వార్త చూసిన అభిమానులు ఖుషి అవుతున్నారు.

Also read : Rakul Preet Singh : తన పెళ్లిని అలా చేసుకోబోతున్న రకుల్ ప్రీత్ సింగ్..

కాగా పవన్ నటిస్తున్న OG మూవీ సెప్టెంబర్ లో రిలీజ్ కాబోతుంది. ఆ సినిమాకి సంబంధించి ఒక 10 శాతం షూటింగ్ బ్యాలన్స్ ఉంది. ఆ బ్యాలన్స్ షూట్ ని ఎలక్షన్స్ అయ్యాక మొదలు పెడతారు. అది పూర్తి చేసిన తరువాతే పవన్.. తన చేతులో ఉన్న ఉస్తాద్ భగత్ సింగ్, వీరమల్లు మొదలు పెడతారు. వీరమల్లుకి సంబంధించిన షూటింగ్ ని పూర్తి చేసి ఆడియన్స్ ముందుకు తీసుకు రావాలంటే.. వచ్చే ఏడాది సంక్రాంతి అయ్యేలా కనిపిస్తుంది.

ఇప్పటికే ఆ సమయంలో చిరంజీవితో పాటు కొన్ని సినిమాలు డేట్ ని లాక్ చేసుకొని కూర్చున్నాయి. మరి పవన్ కూడా వీరమల్లుతో అప్పుడే వస్తాడా లేదా వచ్చే ఏడాది సమ్మర్ కి వస్తాడా అనేది చూడాలి.