Pawan kalyan Hari Hara Veera Mallu release on June 12th
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మూవీల్లో హరి హర వీరమల్లు ఒకటి. పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. రెండు భాగాలుగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవలే తొలి భాగానికి సంబంధించిన షూటింగ్ పూరైనట్లు చిత్ర బృందం చెప్పింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
కీరవాణి సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో నిథి అగర్వాల్ కథానాయిక. సత్యరాజ్, జిషు సేన్‌గుప్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
War 2 teaser : ఎన్టీఆర్ పుట్టిన రోజున వార్ 2 టీజర్.. హృతిక్ రోషన్ ట్వీట్ వైరల్..
ఇప్పటికే పలుమార్లు ఈ చిత్ర విడుదల వాయిదా పడింది. తాజాగా కొత్త రిలీజ్ డేట్ చిత్ర బృందం ప్రకటించింది. జూన్ 12న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపింది.
GET READY FOR THE BATTLE OF A LIFETIME! ⚔️🏹
Mark your calendars for #HariHaraVeeraMallu on June 12, 2025! 💥 💥
The battle for Dharma begins… 🔥⚔️ #HHVMonJune12th #VeeraMallu #DharmaBattle #HHVM pic.twitter.com/Jvxd02JW5a
— Mega Surya Production (@MegaSuryaProd) May 16, 2025
ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు, రెండు పాటలు సినిమా పై అంచనాలను భారీగా పెంచేశాయి. ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.