Hari Hara VeeraMallu : ‘హరిహర వీరమల్లు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్, ప్లేస్ అనౌన్స్.. ఎక్కడ? ఎప్పుడు?

తాజాగా మూవీ యూనిట్ హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ పై అధికారికంగా ప్రకటన చేసింది.

Hari Hara VeeraMallu Pre Release event

Hari Hara VeeraMallu Pre Release event : పవన్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు సినిమా జులై 24న రిలీజ్ కాబోతుంది. అయితే సినిమా కంటే ముందు ఫ్యాన్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ స్పీచ్ కోసం ఎదురుచూస్తున్నారు. హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ పై రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. గతంలో తిరుపతిలో ప్లాన్ చేసారు కానీ ఇప్పుడు లొకేషన్ మార్చేశారు. అలాగే కాశీలో కూడా నార్త్ ఇండియా కోసం స్పెషల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడతామని అంటున్నారు.

తాజాగా మూవీ యూనిట్ హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ పై అధికారికంగా ప్రకటన చేసింది. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని శిల్ప కళావేదికలో జులై 21న సాయంత్రం 6 గంటల నుండి జరుగుతుందని ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ ఈ ఈవెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. మరి ఈ ఈవెంట్ కి గెస్ట్ గా ఎవరు వస్తారు? పవన్ ఏం మాట్లాడతారో చూడాలి.

Also Read : Senthil Kumar : హీరోలు, హీరోయిన్స్ కాదు.. సినిమాటోగ్రాఫర్ టాటూ వేయించుకున్న అభిమాని..

అయితే తిరుపతిలో భారీగా బహిరంగంగా ప్లాన్ చేయగా ఫ్యాన్స్ భారీగా వస్తారని అంచనా వేశారు. కానీ ఫ్యాన్స్ భద్రత ఆలోచించి ఇన్ డోర్ లో చాలా తక్కువ మంది ఫ్యాన్స్ తో, మీడియా ముందు మాత్రమే హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుతారని సమాచారం. మరి నార్త్ ఇండియాలో ఇంకో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందా లేదా అనేది క్లారిటీ రావాలి.

 

Also Read : Nidhhi Agerwal : వేరే వంద సినిమాలు చేసినా ఒకటే.. పవన్ కళ్యాణ్ గారితో ఒక్క సినిమా చేసినా ఒకటే..