Nidhhi Agerwal : వేరే వంద సినిమాలు చేసినా ఒకటే.. పవన్ కళ్యాణ్ గారితో ఒక్క సినిమా చేసినా ఒకటే..
నిధి అగర్వాల్ నేడు హరి హర వీరమల్లు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు తెలిపింది.

Nidhhi Agerwal
Nidhhi Agerwal : పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ సినిమా జులై 24న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఫ్యాన్స్ ఈ సినిమా నాకోసం ఏంఅతగానో ఎదురుచూస్తున్నారు. ఎఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఎ. దయాకర్ రావు నిర్మాణంలో ఎఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. పవన్ రాజకీయాల్లో బిజీ ఉండటం, డైరెక్టర్ ఫైనల్ కాపీని చెక్కే పనిలో ఉండటంతో ఈ సినిమా ప్రమోషన్స్ ని ఎక్కువగా నిధి అగర్వాల్ నడిపిస్తుంది.
నిధి అగర్వాల్ నేడు హరి హర వీరమల్లు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు తెలిపింది.
Also Read : Prabhas -Rana : బాహుబలిని చంపుతాను అన్న రానా.. ప్రభాస్ ఏమన్నాడో తెలుసా..? ప్రభాస్ పోస్ట్ వైరల్..
ఈ సినిమా గురించి, తన పాత్ర గురించి మాట్లాడుతూ.. ఇది ఒక భారీ సినిమా. ఇందులో నటించే అవకాశం రావడమే గొప్ప విషయం. అలాంటిది నాకు పంచమి అనే శక్తివంతమైన పాత్ర లభించింది. ఈ పాత్రలో ఎన్నో కోణాలున్నాయి. పవన్ కళ్యాణ్ గారికి, నాకు మధ్య సన్నివేశాలు బాగుంటాయి. నా పాత్ర కనిపించే పాటల్లో కూడా వైవిధ్యం ఉంటుంది. పంచమి పాత్రకు తగ్గట్టుగా భారీగా దుస్తులు, ఆభరణాలు వేసుకుంటాను. ఈ సినిమాలో అన్ని ఒరిజినల్ నగలు వాడాను. వాటి విలువ దాదాపు 2 కోట్ల వరకు ఉంటుంది. ఈ సినిమాలో పంచమి పాత్ర కోసం రెడీ అవ్వడానికి నాకు రెండు గంటలు పట్టేది. క్రిష్ గారు నా పాత్ర గురించి, కథ గురించి చెప్పినప్పుడే ఈ సినిమా చేయాలని డిసైడ్ అయ్యాను. ఈ సినిమాలో నేను భరతనాట్యం చేసే సీన్ ఒకటి ఉంటుంది. అది చాలా కష్టంగా అనిపించింది అని తెలిపింది.
పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గారితో కలిసి నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారికి ఎంతో స్టార్డం, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వేరే వంద సినిమాలు చేసినా ఒకటే.. పవన్ కళ్యాణ్ గారితో ఒక్క సినిమా చేసినా ఒకటే. పవన్ కళ్యాణ్ గారి నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఆయనకు సాహిత్యం అంటే ఎంతో ఇష్టం. ముఖ్యంగా తెలుగు సాహిత్యం ఎక్కువ చదువుతారు. ఆయనకు ఎంతో నాలెడ్జ్ ఉంది. పవన్ కళ్యాణ్ గారు గొప్ప నటుడు. పాత్రలో సులభంగా ఒదిగిపోతారు అని తెలిపింది.
Also Read : Jabardasth : అనసూయ, నాగబాబు జబర్దస్త్ రీ ఎంట్రీ.. రావడంతోనే గొడవ..
ఇద్దరు దర్శకులు క్రిష్, జ్యోతి కృష్ణ గురించి మాట్లాడుతూ.. క్రిష్ గారు నన్ను పంచమి పాత్రకు ఎంపిక చేశారు. జ్యోతి కృష్ణ గారు సరైన సమయానికి దర్శకత్వ బాధ్యతలు తీసుకొని సినిమాని పూర్తి చేశారు. ఇద్దరూ నాకు స్పెషల్. జ్యోతి కృష్ణ గారు సాంకేతికంగా గొప్పగా ఆలోచిస్తారు అని తెలిపింది.
నిర్మాత ఎఎం. రత్నం గురించి మాట్లాడుతూ.. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా వెనకడుగు వేయలేదు. సినిమాని నమ్మి ఇన్నేళ్లు బలంగా నిలబడ్డారు. రత్నం గారిలా అందరూ ఉండలేరు. ఐదేళ్ల పాటు ఈ సినిమాని తన భుజాలపై మోశారు అని తెలిపింది.
తన తర్వాత సినిమాల గురించి చెప్తూ ప్రభాస్ రాజాసాబ్ చేస్తున్నాను. ఆ తర్వాత కథలు వింటున్నాను. హరిహర వీరమల్లు కోసమే ఇన్నాళ్లు ఆగాను. ఈ సినిమా పార్ట్ 2 లో కూడా ఉంటాను అని తెలిపింది నిధి అగర్వాల్.
Also See : Pooja Hegde : ‘పూజా హెగ్డే’ మోనికా సాంగ్ మేకింగ్ స్టిల్స్.. ఫొటోలు వైరల్..