Jabardasth : అనసూయ, నాగబాబు జబర్దస్త్ రీ ఎంట్రీ.. రావడంతోనే గొడవ..
జబర్దస్త్ లోకి ఎంతమంది వచ్చి వెళ్లినా జడ్జిలలో నాగబాబు స్పెషల్, యాంకర్స్ లో అనసూయ స్పెషల్.

Jabardasth
Jabardasth : టెలివిజన్ లో సూపర్ హిట్ కామెడీ షో జబర్దస్త్. ఈ షో లో చాలా మంది కమెడియన్స్, యాంకర్స్, జడ్జీలు వచ్చి వెళ్ళిపోయినా షో కంటిన్యూగా 12 ఏళ్లుగా సాగుతుంది. త్వరలో 12 ఏళ్ళ జబర్దస్త్ సెలబ్రేషన్స్ స్పెషల్ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. తాజాగా ఈ సెలబ్రేషన్స్ ప్రోమో రిలీజ్ చేసారు.
జబర్దస్త్ లోకి ఎంతమంది వచ్చి వెళ్లినా జడ్జిలలో నాగబాబు స్పెషల్, యాంకర్స్ లో అనసూయ స్పెషల్. దీంతో ఈ ఇద్దరూ కూడా జబర్దస్త్ 12 ఏళ్ళ సెలబ్రేషన్స్ ఎపిసోడ్ కి రీ ఎంట్రీ ఇచ్చారు. అలాగే ఇటీవల మానేసిన ఆది, అదిరే అభి, ధనరాజ్, చమ్మక్ చంద్ర కూడా జబర్దస్త్ లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. తర్వాత వచ్చే ఎపిసోడ్స్ లో వీళ్ళు స్కిట్స్ కంటిన్యూ చేస్తారని టాక్.
Also See : Pooja Hegde : ‘పూజా హెగ్డే’ మోనికా సాంగ్ మేకింగ్ స్టిల్స్.. ఫొటోలు వైరల్..
అయితే 12 ఏళ్ళ జబర్దస్త్ సెలబ్రేషన్ ప్రోమో రిలీజ్ చేయగా అందులో అనసూయ – ఆది గొడవ పడ్డారు. ఆది మాట్లాడే ఇండైరెక్ట్ పంచులకే అనసూయ జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయాను అని చెప్తూ ఫైర్ అయింది. ఇంకా చాలా మైక్ లో చెప్తాను అంటూ ఆదిని భయపెట్టింది. మరి ఆది గురించి అనసూయ ఏం సీక్రెట్స్ చెప్పింది? అనసూయ – ఆది మధ్య గొడవ ఏంటి? నాగబాబు రీ ఎంట్రీ తర్వాత ఎపిసోడ్స్ లో కూడా ఉంటాడా తెలియాలంటే ఈ స్పెషల్ ఎపిసోడ్ వచ్చేదాకా ఎదురుచూడాల్సిందే. మీరు కూడా ప్రోమో చూసేయండి..
Also Read : Rajamouli : రాజమౌళి వ్యాఖ్యలతో.. నిరాశలో ఎన్టీఆర్, చరణ్, ప్రభాస్ ఫ్యాన్స్..