Prabhas -Rana : బాహుబలిని చంపుతాను అన్న రానా.. ప్రభాస్ ఏమన్నాడో తెలుసా..? ప్రభాస్ పోస్ట్ వైరల్..

అక్టోబర్ 31న బాహుబలి సినిమా రీ రిలీజ్ కానుంది.

Prabhas -Rana : బాహుబలిని చంపుతాను అన్న రానా.. ప్రభాస్ ఏమన్నాడో తెలుసా..? ప్రభాస్ పోస్ట్ వైరల్..

Prabhas Rana

Updated On : July 17, 2025 / 3:34 PM IST

Prabhas -Rana : తెలుగు సినీ పరిశ్రమ స్థాయిని మార్చిన సినిమా బాహుబలి. రెండు పార్టులు రిలీజయి భారీ విజయం సాధించి భారీ కలెక్షన్స్ రాబట్టాయి. బాహుబలి మొదటి పార్ట్ రిలీజయి పదేళ్లు అయిన సందర్భంగా ఇటీవలే మూవీ యూనిట్ రీ యూనియన్ సెలబ్రేషన్స్ చేసుకుంది. అలాగే బాహుబలి రెండు పార్టులని కలిపి ఒకే సినిమా కింద రీ రిలీజ్ చేస్తామని ప్రకటించారు.

అక్టోబర్ 31న బాహుబలి సినిమా రీ రిలీజ్ కానుంది. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. బాహుబలి పార్ట్ 1 రిలీజ్ అయ్యాక పార్ట్ 2 వరకు అందర్నీ ఎదురు చూసేలా చేసింది కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్న.

Also Read : Balakrishna – Prabhas : బాలయ్య వల్ల ప్రభాస్ ‘రాజాసాబ్’ వాయిదా? అప్పుడు పోటీ మాములుగా ఉండదు..

అయితే ఇటీవల సోషల్ మీడియాలో ఒకవేళ బాహుబలిని కట్టప్ప చంపకపోతే ఏం జరిగేది అని ఓ నెటిజన్ పోస్ట్ పెట్టగా దానికి రానా స్పందింస్తూ నేను చంపేవాడ్ని అని సరదాగా కామెంట్ చేసారు. రానానే సరదాగా కామెంట్ చేసాడు అనుకుంటే దానికి ప్రభాస్ రిప్లై ఇవ్వడం గమనార్హం.

రానా ఈ పోస్ట్ ని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేయగా ప్రభాస్ దానికి రిప్లై ఇస్తూ.. నేనే అలా జరగనిచ్చాను దీని కోసం అని రాసి బాహుబలి 2 వెయ్యి కోట్ల పోస్టర్ షేర్ చేసాడు. అంటే అలా చంపడం వల్లే బాహుబలి 2 అంత పెద్ద సక్సెస్ అయిందని ఇండైరెక్ట్ గా తెలిపాడు ప్రభాస్. ప్రభాస్ ఇలా సోషల్ మీడియాలో సరదాగా కామెంట్ చేయడంతో ఇది వైరల్ గా మారింది. మొత్తానికి బాహుబలి రీ రిలీజ్ ని గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు అని తెలుస్తుంది.

Rana Reacts to Baahubali Post Prabhas gives Counter

Also Read : Jabardasth : అనసూయ, నాగబాబు జబర్దస్త్ రీ ఎంట్రీ.. రావడంతోనే గొడవ..