Senthil Kumar : హీరోలు, హీరోయిన్స్ కాదు.. సినిమాటోగ్రాఫర్ టాటూ వేయించుకున్న అభిమాని..

ఈ వ్యక్తి హీరోలు, హీరోయిన్స్ కాకుండా ఒక సినిమాటోగ్రాఫర్ టాటూ వేటయించుకోవడం గమనార్హం.

Senthil Kumar : హీరోలు, హీరోయిన్స్ కాదు.. సినిమాటోగ్రాఫర్ టాటూ వేయించుకున్న అభిమాని..

Senthil Kumar

Updated On : July 17, 2025 / 5:46 PM IST

Senthil Kumar : అభిమానులు సినిమా సెలబ్రిటీల మీద తమ అభిమానాన్ని ఒక్కో రకంగా చూపిస్తూ ఉంటారు. కొంతమంది అభిమానులు తమ ఫేవరేట్ హీరోలు, హీరోయిన్స్ టాటూలు కూడా వేయించుకుంటారు. అయితే ఈ వ్యక్తి హీరోలు, హీరోయిన్స్ కాకుండా ఒక సినిమాటోగ్రాఫర్ టాటూ వేటయించుకోవడం గమనార్హం.

రిషి అనే వ్యక్తి నిన్న జూనియర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్టార్ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ ని కలిసి తన చేతిపై వేయించుకున్న సెంథిల్ కుమార్ టాటూని చూపించడంతో సెంథిల్ సైతం ఆశ్చర్యపోయాడు. ఈ ఫోటో వైరల్ అవ్వడంతో సినిమాటోగ్రాఫర్స్ కి కూడా ఇలా టాటూ వేయించుకునేంత అభిమానులు ఉంటారా అని అంతా ఆశ్చర్యపోతున్నారు.

Also Read : Hari Hara Veeramallu : హరిహర వీరమల్లు పార్ట్ 2 పై నిధి అగర్వాల్ అప్డేట్.. పవన్ నుంచి ఇంకో సినిమా..

ఈ రిషి అనే వ్యక్తి కూడా సినీ పరిశ్రమలో కెమెరా డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. ఎప్పటికైనా స్టార్ సినిమాటోగ్రాఫర్ కావాలనేది ఈయన కల. దీంతో సెంథిల్ కుమార్ కెమెరా వర్క్ ని ప్రేరణగా తీసుకొని ఆయనకు ఏకలవ్య శిష్యుడిగా మారి, ఆయన్ని, ఆయన వర్క్ ని అభినందించసాగాడు రిషి. ఇన్నాళ్లకు ఇలా డైరెక్ట్ గా సెంథిల్ ని కలిసే ఛాన్స్ రావడం, తన చేతిపై వేసుకున్న ఆయన టాటూ చూపించడం జరగడంతో ఫుల్ హ్యాపీ.

View this post on Instagram

A post shared by Rishi M (@iluvcinematography)

ఇక స్టార్ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ గురించి తెలిసిందే. కెమెరాలో ఫిలిం ఇన్స్టిట్యూట్ కోర్స్ చేసి కొన్నాళ్ల పాటు కెమెరా డైపర్ట్మెంట్ లో పనిచేసి ఐతే సినిమాతో సినిమాటోగ్రాఫర్ గా మారారు. రాజమౌళి సై సినిమాతో ఆయనతో జతకట్టి ఛత్రపతి, యమదొంగ, మగధీర, ఈగ, బాహుబలి రెండు పార్టులు. RRR .. ఇలా సూపర్ హిట్ సినిమాలన్నీ తన కెమెరాతోనే చిత్రీకటించి స్టార్ సినిమాటోగ్రాఫర్ గా ఎదిగారు. మధ్యలో అరుంధతి, గోల్కొండ హై స్కూల్.. లాంటి పలు సినిమాలు చేసారు. ఇప్పుడు జూనియర్ సినిమాతో రాబోతున్నారు. అనంతరం స్వయంభు, ది ఇండియన్ హౌస్ సినిమాల చిత్రీకరణలో బిజీగా ఉన్నారు సెంథిల్. మొత్తానికి ఒక సినిమాటోగ్రాఫర్ టాటూని ఓ అభిమాని వేయించుకోవడంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.

Also Read : Nidhhi Agerwal : వేరే వంద సినిమాలు చేసినా ఒకటే.. పవన్ కళ్యాణ్ గారితో ఒక్క సినిమా చేసినా ఒకటే..