HariHara Veeramallu : తెలంగాణలో కూడా హరిహర వీరమల్లు టికెట్ రేట్లు పెంపు..? పుష్ప ఘటన తర్వాత ఎవ్వరికీ పెంచని ప్రభుత్వం.. ఈ సినిమాకు ఎందుకో తెలుసా?

ఏపీలో ఎలాగో పెరుగుతాయి కానీ తెలంగాణలో పెరుగుతాయా అనే అనుమానం అందరికి ఉంది.

HariHara Veeramallu

HariHara Veeramallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా జులై 24న గ్రాండ్ గా పాన్ ఇండియా వైడ్ థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఇటీవల పెద్ద సినిమాలకు, భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ రేట్లు పెంచుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హరిహర వీరమల్లు సినిమాకు కూడా టికెట్ రేట్లు పెరుగబోతున్నాయి. ఏపీలో ఎలాగో పెరుగుతాయి కానీ తెలంగాణలో పెరుగుతాయా అనే అనుమానం అందరికి ఉంది.

నేడు నిర్మాత ఏఎం రత్నం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో టికెట్ రేట్లు పెంచుతున్నారు. తెలంగాణలో కూడా అడిగాము. సీఎం రేవంత్ రెడ్డి గారు చూద్దాం అన్నారు. సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిసాను. సినిమా కూడా కొంత చూపించాను. చాలా బాగుంది అన్నారు. ఎవ్వరికి పెంచట్లేదు కానీ చారిత్రాత్మిక సినిమాలకు టికెట్ రేట్లు పెంచుతామన్నారు గతంలోనే. హరిహర వీరమల్లు చారిత్రాత్మిక సినిమా, అందులోను నిజాం కాలం కథ కూడా ఉంది కాబట్టి ఈ సినిమాకి టికెట్ రేట్లు పెంచమని అడిగాను. సినిమాటోగ్రఫీ మంత్రి పెంచుతాను, ఒకసారి సీఎం గారితో మాట్లాడి చెప్తాను అన్నారు. అలాగే ఏపీలో పెరిగాక జీవో తీసుకురండి దాన్ని చూసి రేట్ల పెంపు చేద్దాం అన్నట్టు తెలిపారు.

Also Read : Hari Hara VeeraMallu : పవన్ ఫ్యాన్స్ కి పండగే.. ముందు రోజే ప్రీమియర్లు.. మరి తెలంగాణలో పరిస్థితి ఏంటి?

దీంతో పుష్ప 2 సినిమాకు సంధ్య థియేటర్ వద్ద జరిగిన సంఘటన తర్వాత మొదటిసారి హరిహర వీరమల్లు సినిమాకు చారిత్రాత్మిక సినిమా కాబట్టి టికెట్ రేట్లు పెంచే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఏపీలో టికెట్ రేట్లు పెంచినట్టు తాజాగా ప్రకటించారు. ఏపీలో హరి హర వీరమల్లు సినిమాకు టికెట్ రేట్లు మొదటి రెండు వారాలకు పెంచాలని నిర్మాతలు కోరగా కేవలం మొదటి పది రోజులకే టికెట్ రేట్లు పెంచేలా అనుమతులు ఇచ్చారు ప్రభుత్వం. అయితే కేవలం అప్పర్ క్లాస్..150 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 200 రూపాయలు మాత్రమే పెంచుకునేలా అనుమతులు ఇచ్చారు. లోయర్, మిడిల్ క్లాస్ కి ఎటువంటి పెంపు లేదని తెలుస్తుంది.

ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి షోలతో పాటే ముందురోజు రాత్రి 9.30 గంటల నుంచి ప్రీమియర్ షోలు వేసే ఆలోచనలో ఉన్నారు. మూవీ యూనిట్ ఇప్పటికే దీనిపై రెండు ప్రభుత్వాలతో మాట్లాడుతుంది.

Also Read : Hari Hara Veeramallu : నార్త్ ఇండియన్ పవన్ ఫ్యాన్స్ కి నిరాశే.. ‘హరిహర వీరమల్లు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదంట.. కానీ..