Pawan Kalyan HariHara VeeraMallu Movie Trailer Launch Event
HariHara VeeraMallu : పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా అనేక వాయిదాల అనంతరం జులై 24 రిలీజ్ కాబోతుంది. ఫ్యాన్స్ ఈ సినిమా కోసం గత అయిదేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి సాంగ్స్, టీజర్, గ్లింప్స్ రిలీజ్ చేసి అంచనాలు పెంచారు. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు.
పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ ని రేపు జులై 3 ఉదయం 11 గంటల 10 నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. అలాగే తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటకలో కూడా కొన్ని థియేటర్స్ లో ట్రైలర్ ని షో వేస్తున్నారు. దీంతో ఫ్యాన్స్ ఆయా థియేటర్స్ వద్ద సందడి చేయడానికి సిద్ధం అయ్యారు. ఈ క్రమంలో మూవీ యూనిట్ కూడా ఓ థియేటర్లో సందడి చేయబోతుంది.
హీరోయిన్ నిధి అగర్వాల్, డైరెక్టర్ జ్యోతికృష్ణ, నిర్మాతలు ఏఎం రత్నం, దయాకర్ రావులు హైదరాబాద్ లోని విమల్ థియేటర్లో రేపు ఉదయం ట్రైలర్ రిలీజ్ సమయానికి ట్రైలర్ ని వీక్షించనున్నారు. అనంతరం ఫ్యాన్స్ ని ఉద్దేశించి మాట్లాడనున్నారు. దీంతో ఆ థియేటర్ వద్దకు ఫ్యాన్స్ భారీగా చేరుకోబోతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఇప్పటికే హరిహర వీరమల్లు ట్రైలర్ ని చూసి సంతోషం వ్యక్తం చేసారు. మరి హరిహర వీరమల్లు ట్రైలర్ ఏ రేంజ్ లో ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.
The warrior roars across Nizam land 🔥
Witness the #HHVMTrailer in following theatres on July 3rd from 11:10AM ⚔️#HariHaraVeeraMallu #HHVMonJuly24th #HHVM
Powerstar @PawanKalyan @AMRathnamOfl @thedeol #SatyaRaj @AgerwalNidhhi @amjothikrishna @mmkeeravaani @ADayakarRao2… pic.twitter.com/46Q7yst5Hi
— Mega Surya Production (@MegaSuryaProd) June 30, 2025