HariHara VeeraMallu : ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..

తాజాగా హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ని ప్రకటించారు మూవీ యూనిట్.

Pawan Kalyan HariHara VeeraMallu Movie Trailer Released Date Announced

HariHara VeeraMallu : పవన్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు సినిమా జులై 24న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తున్నామని ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ యోధుడి పాత్రలో కనిపించబోతుండటంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే టీజర్, సాంగ్స్ రిలీజ్ చేసి మెప్పించారు. ఇటీవల VFX పనులు ఇంకా అవ్వలేదని సినిమా వాయిదా పడింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.

తాజాగా హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ని ప్రకటించారు మూవీ యూనిట్. హరిహర వీరమల్లు ట్రైలర్ ని జులై 3న ఉదయం 11 గంటల 10 నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఈ ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నారు.

Also Read : Preity Mukhundhan : ‘కన్నప్ప’ హీరోయిన్.. అంత పెద్ద రోల్ చేసి.. అందర్నీ మెప్పించి.. ఒక్క పోస్ట్ లేదు, ప్రమోషన్ లేదు.. ఎందుకు?


ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మాణంలో క్రిష్ జాగర్లమూడి, ఎ.ఎం. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా బాబీ డియోల్, నిధి అగర్వాల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్, జిషు సేన్‌గుప్తా, నాజర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, నోరా ఫతేహి.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.