Preity Mukhundhan : ‘కన్నప్ప’ హీరోయిన్.. అంత పెద్ద రోల్ చేసి.. అందర్నీ మెప్పించి.. ఒక్క పోస్ట్ లేదు, ప్రమోషన్ లేదు.. ఎందుకు?
ప్రీతీ సినిమా రిలీజ్ కి ముందు కానీ తర్వాత కానీ ఎక్కడా ప్రమోషన్స్ లో కనిపించలేదు.

Why Preity Mukhundhan avoid Kannappa Movie Promotions
Preity Mukhundhan : మంచు విష్ణు కన్నప్ప సినిమా నిన్న జూన్ 27 న రిలీజయింది. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్లడంతో ఈ సినిమా ప్రేక్షకులని మెప్పిస్తుంది. కన్నప్ప సెకండ్ హాఫ్ అయితే ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టిస్తూ భక్తిరసంలో ముంచేస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్ కి ప్రేక్షకులు అంతా విష్ణుకి కనెక్ట్ అయిపోతున్నారు. ప్రమోషన్స్ లో ఈ సినిమాలో నటించిన వాళ్లంతా పాల్గొన్నారు. ఒక్క ప్రభాస్, హీరోయిన్ ప్రీతీ ముకుందన్ తప్ప.
ప్రభాస్ ఎలాగో ప్రమోషన్స్ కి దూరం ఉంటారని తెలిసిందే. అయితే ప్రీతీ ముకుందన్ ఈ సినిమాలో కన్నప్ప భార్య నెమలి పాత్రలో కనిపించింది. ఆల్మోస్ట్ సినిమా అంతా ఉంటుంది. ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్. కత్తి విన్యాసాలు, యుద్దాలు, యాక్షన్ సీక్వెన్స్ చేసింది. విష్ణుతో రెండు పాటల్లో రెచ్చిపోయి మరీ రొమాన్స్ చేసింది. తన అందంతో, నటనతో యూత్ ని ఫిదా చేసేసింది ప్రీతీ ముకుందన్.
కానీ ప్రీతీ సినిమా రిలీజ్ కి ముందు కానీ తర్వాత కానీ ఎక్కడా ప్రమోషన్స్ లో కనిపించలేదు. కనీసం తన సోషల్ మీడియాలో కన్నప్ప సినిమా గురించి ఒక్క పోస్ట్ కూడా లేదు. కన్నప్పలో తనని హీరోయిన్ గా ప్రకటించినప్పుడు ఒక పోస్ట్ పెట్టింది. ఆ తర్వాత మళ్ళీ కన్నప్ప గురించి ఎక్కడా మాట్లాడలేదు, కన్నప్ప ప్రమోషన్స్ లో ఎక్కడా కనిపించలేదు. సినిమా చూసాక ప్రేక్షకులు ఇంత పెద్ద క్యారెక్టర్, ఇంత మంచి నటన, ఇంత అందంతో అందర్నీ కట్టిపడేసిన ప్రీతీ కన్నప్ప ని ఎందుకు తన కెరీర్ కి ప్రమోషన్ గా వాడుకోవట్లేదు అని అందరూ చర్చించుకుంటున్నారు.
అయితే టాలీవుడ్ సమాచారం ప్రకారం న్యూజిలాండ్ లో షూటింగ్ సమయంలో కన్నప్ప మూవీ యూనిట్ కి ప్రీతీకి కొన్ని సమస్యలు వచ్చాయని, ప్రీతీ మూవీ యూనిట్ ని ఇబ్బంది పెటింది, విష్ణుతో కూడా విబేధాలు వచ్చాయని వినిపిస్తుంది. అందుకే అగ్రిమెంట్ ప్రకారం సినిమా పూర్తిచేసేసి వెళ్ళిపోయింది, అందుకే సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనలేదు, సినిమా గురించి పోస్టులు పెట్టట్లేదు అని తెలుస్తుంది. మరి దీనిపై ప్రీతీ స్పందిస్తుందా, ఇంత మంచి సినిమా, క్యారెక్టర్ ప్రీతీ తన కెరీర్ కి ప్లస్ అయ్యేలా వాడుకుంటుందా చూడాలి.