Pawan Kalyan HariHara VeeraMallu Movie Update by Movie Unit
HariHara VeeraMallu : పవన్ రాజకీయాల్లో బిజీ అవ్వడంతో తన చేతిలో ఉన్న సినిమాలు ఎలా అయినా పూర్తిచేయాలని చూస్తున్నారు. దీంతో తనకు కుదిరినప్పుడు సినిమాలకు డేట్స్ ఇస్తూ షూట్స్ చేస్తున్నారు పవన్. హరిహర వీరమల్లు సినిమాకు డిప్యూటీ సీఎం అయ్యాక కుదిరినప్పుడల్లా డేట్స్ ఇస్తూ ఒక్కోసారి రాత్రిళ్ళు కూడా షూట్స్ చేస్తూ సినిమాని త్వరగా పూర్తిచేయాలని చూస్తున్నారు.
Also See : Allu Arjun – Rashmika Mandanna : కేరళలో అల్లు అర్జున్, రష్మిక.. స్టైలిష్ లుక్స్ తో అదరగొట్టారుగా..
హరిహర వీరమల్లు సినిమా ఇప్పటికే మూడేళ్ళుగా సాగుతుంది. పలుమార్లు రిలీజ్ డేట్స్ వాయిదా పడి ఇటీవల 28 మార్చ్ 2025 లో ఎట్టి పరిస్థితుల్లోనూ రిలీజ్ చేసి తీరుతామని ప్రకటించారు. తాజాగా మూవీ నిర్మాణ సంస్థ షూటింగ్స్ సెట్స్ నుంచి పవన్ కళ్యాణ్ ఉన్న ఒక వర్కింగ్స్ స్టిల్ షేర్ చేసి.. ధర్మం కోసం యుద్ధం చివరి షెడ్యూల్ లోకి ఎంటర్ అయింది. ఇది గొప్పగా, ఒక జ్ఞాపకంగా ఉంటుందని మేము ప్రమాణం చేస్తున్నాము. పవన్ కళ్యాణ్ గారు ఈ వీకెండ్ నుంచి హరిహర వీరమల్లు షూట్ లో జాయిన్ అవుతారు అని పోస్ట్ చేసారు. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.
మొన్నటివరకు షూట్ చాలా ఉంది అనుకున్నారు. ఇప్పుడు లాస్ట్ షెడ్యూల్ అని చెప్పడంతో పవన్ ఎప్పుడు పూర్తిచేసాడు, ఓ పక్క ప్రభుత్వంలో బిజీగా ఉంటూనే మరో పక్క ఇంత భారీ సినిమాని ఎలా ఫినిష్ చేస్తున్నాడు అంటూ అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇక హరిహర వీరమల్లు సినిమా మెగా సూర్య ప్రొడక్షన్స్ నిర్మాణంలో AM రత్నం నిర్మాతగా జ్యోతికృష్ణ దర్శకత్వంలో భారీ పీరియాడిక్ సినిమాగా తెరకెక్కుతుంది. ఇందులో బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, నిధి అగర్వాల్.. లాంటి స్టార్స్ నటిస్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్ కి మొదటి పాన్ ఇండియా సినిమా కావడం గమనార్హం. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్, టీజర్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Power Update Alert!! 📣📣
The Epic Battle for Dharma has entered its last leg of shoot. We promise you that this battle will be outrageous, grand and memorable. Powerstar 🌟 @PawanKalyan garu will be joining the shoot of our #HariHaraVeeraMallu from this weekend! pic.twitter.com/jbjqhyUtNi
— Mega Surya Production (@MegaSuryaProd) November 27, 2024