Pawan Kalyan : ఎవ్వరికి పర్మిషన్ ఇవ్వని తెలంగాణ ప్రభుత్వం.. పవన్ కళ్యాణ్ కి ఇస్తారా?

జులై 24న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది హరిహర వీరమల్లు మూవీ.

Pawan Kalyan

Pawan Kalyan : జులై 24న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది హరిహర వీరమల్లు మూవీ. పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్ రెండేళ్ల గ్యాప్‌ తర్వాత వెండితెరమీద కనిపిస్తున్న సినిమా ఇది. ఈ సినిమాపై ఓ రేంజ్‌లో హైప్ క్రియేట్ అయింది. ఫ్యాన్స్ అంచనాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ఈ హైప్, బజ్‌ను పీక్‌ లెవల్‌కి తీసుకెళ్లేందుకు హరిహర వీరమల్లు మూవీ ప్రీమియర్స్‌ వేసేందుకు నిర్మాతలు రెడీ అవుతున్నారట.

ఏపీలో టికెట్ రేట్ల పెంపుకు, ప్రీమియర్స్ కు, అర్ధరాత్రి షోలకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ పుష్ప-2 రిలీజ్ సందర్భంగా జరిగిన ఘటనతో తెలంగాణలో ప్రీమియర్స్‌కు పర్మీషన్ దొరకడం కాస్త కష్టంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం గతంలోనే ప్రీమియర్స్‌కు, టికెట్ల రేట్ల పెంపునకు అనుమతి ఇవ్వమంటూ చెప్పింది. ఆ తర్వాత ఒకటి, రెండు సినిమాలకు టికెట్లు రేట్లు పెంచినా ప్రీమియర్స్‌కు, మిడ్ నైట్ షో లకు మాత్రం అనుమతివ్వలేదు.

Also Read : RK Sagar : మొగలిరేకులు ఫేమ్ ‘ఆర్కే నాయుడు’ భార్య ఏం చేస్తుందో తెలుసా?

పుష్ప-2 తర్వాత టాలీవుడ్‌లో పెద్ద సినిమాలకు స్పెషల్ షోలు, ఈవెంట్స్‌పై భారీ ఆంక్షలు వచ్చాయి. థియేటర్ యాజమాన్యాలు, పోలీసులు భద్రతా విషయంలో స్ట్రిక్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ నిబంధనల మధ్యలో హరిహర వీరమల్లు సినిమాకు స్పెషల్ ప్రీమియర్స్ కోసం నిర్మాతలు గట్టిగా ప్రయత్నిస్తున్నారట. పవన్ కళ్యాణ్ హీరోగా, క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రిలీజ్‌ కానుంది.

ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ 24 గంటల్లో 48 మిలియన్ వ్యూస్‌తో పుష్ప-2 రికార్డ్‌ను బద్దలు కొట్టింది. ఈ హైప్‌తో నిర్మాతలు ప్రీమియర్స్‌తో జోష్‌ను మరింత పెంచాలనుకుంటున్నారట. కానీ జులై 2న సంధ్య థియేటర్‌లో జరగాల్సిన హరిహర వీరమల్లు ట్రైలర్ స్క్రీనింగే క్యాన్సిల్ అయింది. అభిమానుల రద్దీతో పరిస్థితి అదుపు తప్పడంతో భద్రతా కారణాలతో ట్రైలర్ ప్రదర్శనను ఆపేశారు.

Also Read : Vijay Deverakonda : నాకు సపోర్ట్ లేదు.. ఒక హీరో వాళ్ళ నాన్నకు స్క్రిప్ట్ నచ్చకపోతే.. విజయ్ కామెంట్స్ ఏ హీరో మీద?

ఇప్పుడు స్పెషల్ ప్రీమియర్స్ కోసం నిర్మాతలు, థియేటర్ యాజమాన్యాలు పోలీసులతో చర్చలు జరుపుతున్నట్లు టాక్. అభిమానుల ఉత్సాహాన్ని కంట్రోల్ చేస్తూ, భద్రతా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రీమియర్స్‌ వేసేందుకు పకడ్బందీ ప్లాన్‌ చేస్తున్నారట. ఈ ప్రీమియర్స్ జులై 24న తెల్లవారుజామున జరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ రూమర్ తో పవన్ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. పుష్ప 2 తర్వాత ఎవరికీ పర్మిషన్ ఇవ్వని తెలంగాణ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ప్రీమియర్స్‌కు అనుమతి ఇస్తుందా చూడాలి.