RK Sagar : మొగలిరేకులు ఫేమ్ ‘ఆర్కే నాయుడు’ భార్య ఏం చేస్తుందో తెలుసా?
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన భార్య గురించి తెలిపాడు సాగర్.

RK Sagar
RK Sagar : చక్రవాకం, మొగలిరేకులు సీరియల్స్ తో ఆర్కే సాగర్ మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు. తర్వాత సీరియల్స్ కి గుడ్ బై చెప్పి హీరోగా సినిమాలు చేస్తున్నాడు. సాగర్ హీరోగా నటించిన ది 100 సినిమా జులై 11న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన భార్య గురించి తెలిపాడు సాగర్.
ఆర్కే సాగర్ మాట్లాడుతూ.. నా భార్య పేరు సౌందర్య. గతంలో ఒక డిజిటల్ మీడియా కంపెనీ నడిపించింది. పిల్లలు పుట్టాక గ్యాప్ తీసుకుంది. ఇప్పుడు ఆత్మన్ ది లేబుల్ అనే క్లాత్ బ్రాండ్ ని ప్రారంభించింది. క్లాత్ బిజినెస్ చేస్తుంది. అందులో ఇంకా రీసెర్చ్ కూడా చేస్తుంది అని తెలిపాడు.
ఆర్కే సాగర్ కు ఒక బాబు, ఒక పాప ఉన్నారు. భార్య సౌందర్య పిల్లలు పుట్టాక వర్క్ ఆపేసి ఇటీవలే మళ్ళీ క్లాత్ బిజినెస్ మొదలుపెట్టింది. తన బిజినెస్ కి సంబంధించి రెగ్యులర్ గా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.