HariHara VeeraMallu : హరిహర వీరమల్లు మళ్ళీ వాయిదా? చివరి నిమిషంలో ఫ్యాన్స్ కి షాక్ ఇస్తారా?

తాజాగా హరిహర వీరమల్లు సినిమా మరోసారి వాయిదా పడుతుందని రూమర్స్ వినిపిస్తున్నాయి.

Pawan Kalyan HariHara VeeraMallu Postponed Again

HariHara VeeraMallu : పవన్ రాజకీయాల బిజీ వల్ల గత అయిదేళ్లుగా సాగుతున్న హరిహర వీరమల్లు సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తయి రిలీజ్ కి రెడీ అయింది. పలు వాయిదాల అనంతరం జూన్ 12 రిలీజ్ కానుందని ప్రకటించి మూవీ యూనిట్ ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. అయితే తాజాగా హరిహర వీరమల్లు సినిమా మరోసారి వాయిదా పడుతుందని రూమర్స్ వినిపిస్తున్నాయి.

హరిహర వీరమల్లు సినిమా సెన్సార్ ఇంకా పూర్తవలేదని సమాచారం. రేపు లేదా ఎల్లుండి అయినా సెన్సార్ అవుతుంది అంటున్నారు. అలాగే కొన్ని టెక్నికల్ ఇష్యూలు కూడా వచ్చాయని, VFX వర్క్ ఇంకా అవ్వలేదని అంటున్నారు. హరిహర వీరమల్లు డైరెక్టర్ జ్యోతికృష్ణ, మూవీ యూనిట్ అంతా రాత్రి, పగలు తేడా లేకుండా సినిమా రిలీజ్ చేయడానికి కష్టపడుతున్నారు.

Also Read : Kamal Haasan : కోర్టు చెప్పినా వినని కమల్ హాసన్.. ఆగిపోయిన ‘థగ్‌ లైఫ్’ సినిమా రిలీజ్.. కర్ణాటకలో ‘కమల్ కన్నడ’ రగడ..

ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా ఇప్పుడు కూడా వాయిదా పడితే కష్టమే అంటున్నారు. ఫ్యాన్స్ కి చివరి నిమిషంలో షాక్ ఇస్తారా అని చర్చ నడుస్తుంది. ఒకవేళ వాయిదా పడితే జులై 4 లేదా జులై 12 రిలీజ్ అవుతుంది అని కూడా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఫ్యాన్స్ మాత్రం మళ్ళీ వాయిదా పడకుండా రిలీజ్ అయ్యేలా చూడాలని మూవీ యూనిట్ ని రిక్వెస్ట్ చేస్తున్నారు.