Pawan Kalyan HariHara VeeraMallu Pre Release Event also Postponed
HariHara VeeraMallu : పవన్ రాజకీయాల బిజీ వల్ల గత అయిదేళ్లుగా సాగిన హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ఎట్టకేలకు పవన్ పూర్తిచేయడంతో సినిమాని జూన్ 12 రిలీజ్ చేస్తామని ప్రకటించి ప్రమోషన్స్ కూడా చేసారు. అయితే తాజాగా హరిహర వీరమల్లు సినిమా మరోసారి వాయిదా పడుతుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. హరిహర వీరమల్లు సినిమాకు కొన్ని టెక్నికల్ ఇష్యూలు వచ్చాయని, VFX వర్క్ ఇంకా అవ్వలేదని టాలీవుడ్ సమాచారం.
సినిమా జూన్ 12 రిలీజ్ అవుతుందని ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ప్లాన్ చేసారు మూవీ యూనిట్. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలోని SV యూనివర్సిటీ తారకరామ క్రీడా మైదానంలో జూన్ 8న సాయంత్రం నిర్వహించడానికి పర్మిషన్ కోసం పోలీసులకు దరాఖాస్తు చేసారు. ఆ స్థలంలో వర్క్ కూడా మొదలుపెట్టారు. కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా వేశారని తెలుస్తుంది.
Also Read : Siddhu Jonnalagadda : సినిమా ఫ్లాప్ అవ్వడంతో.. సగం రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేసిన డీజే టిల్లు..
చాలా గ్యాప్ తర్వాత పవన్ సినిమా వస్తుండటం, అనేక వాయిదాల తర్వాత హరిహర వీరమల్లు రిలీజ్ అవుతుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తుంటే మరోసారి సినిమా వాయిదా, ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా అనడంతో మళ్ళీనా అని నిరాశ చెందుతున్నారు. మరి హరిహర వీరమల్లు సినిమా జూన్ 12 రిలీజ్ అవుతుందా లేక వాయిదా వేసి మరోసారి ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లుతారా చూడాలి.