Siddhu Jonnalagadda : సినిమా ఫ్లాప్ అవ్వడంతో.. సగం రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేసిన డీజే టిల్లు..
తాజాగా సిద్ధూ జొన్నలగడ్డ కూడా తన సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఇదే పని చేసాడట.

Siddhu Jonnalagadda Gives Half Remuneration back to Producer after Jack Flop
Siddhu Jonnalagadda : అప్పుడప్పుడు సినిమాలు ఫ్లాప్ అయితే పలువురు హీరోలు బాధ్యతాయుతంగా మంచి మనసుతో నిర్మాతలు నష్టపోకూడదని తమ రెమ్యునరేషన్ లో కొంతభాగం వెనక్కి ఇచ్చేస్తూ ఉంటారు. గతంలో అనేకమంది హీరోలు ఇలా చేసినవారే. తాజాగా సిద్ధూ జొన్నలగడ్డ కూడా తన సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఇదే పని చేసాడట.
ఎన్నో ఏళ్ళ నుంచి సినీ పరిశ్రమలో ఉన్నా డీజే టిల్లు సినిమాతో సిద్ధు జొన్నలగడ్డకు స్టార్ డమ్ వచ్చింది. ఇటీవల సిద్ధు జాక్ సినిమాతో రాగా ఆ సినిమా పరాజయం పాలైంది. దీంతో సిద్ధు తన రెమ్యునరేషన్ లో సగం 4 కోట్ల రూపాయలను నిర్మాతకు తిరిగి ఇచ్చేశారని టాలీవుడ్ సమాచారం. ఈ సినిమాకు సిద్దు 8 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడు. దీంతో సిద్ధుని పలువురు అభినందిస్తున్నారు.
Also Read : RCB – IPL 2025 : ఆర్సీబీ విన్నింగ్ పై టాలీవుడ్ సెలబ్రిటీల పోస్టులు.. మహేష్, బన్నీ, విజయ్, రష్మిక, సమంత..
సిద్దు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జంటగా తెరకెక్కిన జాక్ సినిమాని శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో స్పై కామెడీ జానర్లో తెరకెక్కించారు. థియేటర్స్ లో ఏప్రిల్ 10న రిలీజయి పరాజయం పాలవ్వగా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో అందుబాటులో ఉంది.