Pawan Kalyan : ఎమ్మెల్యేగా నా జీతం మొత్తం తీసుకుంటాను.. ఎందుకంటే.. పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఎమ్మెల్యేగా తనకు రాబోయే జీతం గురించి పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

Pawan Kalyan Interesting Comments on his Salary for MLA in Andhra Pradesh

Pawan Kalyan : ఏపీలో టీడీపీ – బీజేపీ – జనసేన కూటమి భారీ విజయం సాధించింది. త్వరలోనే ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం కూటమి సంబరాల్లో మునిగింది. ఇక గెలిచిన పార్టీ అధినేతలు తమ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో మంగళగిరి జనసేన ఆఫీస్ లో సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో రాబోయే రోజుల్లో ఏం చేయాలి, ఎలా ఉండాలి అనే అంశాలపై చర్చించినట్టు సమాచారం. అయితే ఈ సమావేశంలో ఎమ్మెల్యేగా తనకు రాబోయే జీతం గురించి పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

Also Read : Ashwini Dutt : ప్రభాస్ కల్కి సినిమా నిర్మాతకు టీటీడీ చైర్మన్ పదవి..? గతంలో రాఘవేంద్రరావు అలా..

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. నేను కలగన్నాను ఆంధ్రప్రదేశ్ కి ఏదైనా చేయాలని. మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి. ప్రభుత్వం నుంచి జీతం తీసుకునేవాడు. దానికి మేము రుణపడి ఉన్నాం. అందుకే నేను కూడా ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యేగా జీతం మొత్తం తీసుకుంటాను. కానీ తర్వాత నేను ఇవ్వాల్సింది ఇస్తాను. ఎందుకు తీసుకుంటాను అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ముని తింటున్నాను, ఆ బాధ్యత అనుక్షణం గుర్తు చేసుకోడానికి. నేను తీసుకునే జీతంలో ప్రతి రూపాయికి ప్రజలు నన్ను చొక్కా పట్టుకొని అడగాలి. ఒకవేళ మనం పనిచేయకపోతే మీకు మా ట్యాక్స్ మనీతో శాలరీ ఇస్తున్నాం, నువ్వు ఎందుకు పనిచేయట్లేదు అని ప్రజలు అడగాలి. అందుకు నేను ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటాను. ప్రజల డబ్బు శాలరీగా తీసుకుంటున్నాను అనే భయంతో నేను పనిచేయాలి. గతంలో చాలా సార్లు అనుకున్నాను ఎమ్మెల్యేగా జీతం తీసుకోవాలా వద్దా అని. ప్రజల కష్టం నుంచి వచ్చిన డబ్బు మనం తీసుకుంటున్నాం కాబట్టి మనం జవాబుదారిగా ఉండాలి, అందుకే నేను జీతం తీసుకుంటాను. తర్వాత అది మళ్ళీ నేను ప్రజలకు ఇచ్చేది వాళ్ళకే ఇచ్చేస్తాను అని అన్నారు.

దీంతో పవన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటివరకు ఎమ్మెల్యేలుగా జీతం తీసుకునే వాళ్ళు ఎవరూ ఇలా మాట్లాడలేదని పవన్ ని అభినందిస్తున్నారు. ఏపీలో ఎమ్మెల్యేలకు 1.30 లక్షల వరకు జీతం వస్తుందని సమాచారం.