Ashwini Dutt : ప్రభాస్ కల్కి సినిమా నిర్మాతకు టీటీడీ చైర్మన్ పదవి..? గతంలో రాఘవేంద్రరావు అలా..

టీటీడీ చైర్మన్ పదవి సినీ పరిశ్రమలో స్టార్ నిర్మాతకు రాబోతుందని వార్తలు వస్తున్నాయి.

Ashwini Dutt : ప్రభాస్ కల్కి సినిమా నిర్మాతకు టీటీడీ చైర్మన్ పదవి..? గతంలో రాఘవేంద్రరావు అలా..

Kalki Movie Producer Ashwini Dutt will get TTD Chairman Post after Forming AP Government Rumours goes Viral

Updated On : June 6, 2024 / 9:12 AM IST

Ashwini Dutt : ఏపీలో కూటమి ఘన విజయం సాధించడంతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. దీంతో గత ప్రభుత్వంలో ఉన్న కార్పొరేషన్ చైర్మన్లు, పలు పదవుల్లో ఉన్న వాళ్ళు రిజైన్ చేస్తుండగా త్వరలోనే కూటమి ప్రభుత్వం తరపున కొత్త వాళ్ళని నియమించనున్నారు. ఆల్రెడీ ప్రస్తుతం టీటీడీ(తిరుమల తిరుపతి దేవస్థానం) చైర్మన్ గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసాడు. దీంతో ఈ పదవి సినీ పరిశ్రమలో స్టార్ నిర్మాతకు రాబోతుందని వార్తలు వస్తున్నాయి.

టాలీవుడ్ స్టార్ నిర్మాత, వైజయంతి మూవీస్ అధినేత అశ్వినీదత్ ముందు నుంచి కూడా టీడీపీ పార్టీనే. ఎన్టీఆర్ ఉన్నప్పట్నుంచి ఆ పార్టీకి ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు ఇస్తూనే వచ్చారు. ఇటీవల చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కూడా మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు అరెస్ట్ ని ఖండించి, కూటమి భారీగా గెలుస్తుందని చెప్పాడు. అశ్వినీదత్ టీడీపీ సపోర్ట్ అని పరిశ్రమలో కూడా అందరికి తెలిసిందే. అలాగే అశ్వినీదత్ కు ఎన్టీఆర్ కుటుంబంతో, చంద్రబాబుతో మంచి సాన్నిహిత్యం ఉంది.

Also Read : Mahesh – Rajamouli : మహేష్ – రాజమౌళి సినిమాకు ఐడియా ఇచ్చింది ఇతనే.. రాజమౌళి వేరేవి అనుకుంటే వద్దని..

ఈ క్రమంలో టీడీపీ – జనసేన – బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఖాళీ అయిన టీటీడీ చైర్మన్ పదవి నిర్మాత అశ్వినీదత్ కు దక్కుతుందని టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇవి ఎంతవరకు నిజం అనేది తెలీదు. అధికారికంగా ప్రకటించేదాకా ఎదురుచూడాల్సిందే. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు సినీ పరిశ్రమ నుంచి దర్శకుడు రాఘవేంద్ర రావు టీటీడీ మెంబర్ గా, టీటీడీ ఆధ్వర్యంలో నడిచే SVBC ఛానల్ కు చైర్మన్ గా కూడా ఉన్నారు. దీంతో అశ్వినీదత్ కు కూడా టీటీడీ చైర్మన్ పదవి వచ్చే అవకాశం ఉండొచ్చు అని భావిస్తున్నారు. ఇక అశ్విని దత్ ప్రభాస్ తో నిర్మిస్తున్న కల్కి సినిమా జూన్ 27న రిలీజ్ కానుంది.