Pawan Kalyan : తమిళ్‌లో తన ఫేవరేట్ డైరెక్టర్ ఎవరో చెప్పిన పవర్ స్టార్.. వీళ్లిద్దరి కాంబినేషన్లో సినిమా పడితే..

తాజాగా పవన్ కళ్యాణ్ ఓ తమిళ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు.

Pawan Kalyan Interesting Comments on Tamil Movie Director goes Viral

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా పవన్ కళ్యాణ్ ఓ తమిళ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ క్రమంలో సినిమాల గురించి ప్రస్తావన రాగా తమిళ్ లో తన ఫేవరేట్ కమెడియన్, డైరెక్టర్స్ గురించి మాట్లాడారు.

Also Read : Ajay Patnaik : మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకెళ్తున్న ఆర్పీ పట్నాయక్‌ కజిన్ అజయ్ పట్నాయక్.. ఒక్క సినిమాతో నాలుగు సినిమా ఛాన్సులు..

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తమిళ్ లో యోగి బాబు గారంటే ఇష్టం. ఆయన నటన చాలా బాగుంటుంది. ఇటీవల ఆయన నటించిన ఒక సినిమా చూసాను. చాలా బాగా పర్ఫార్మ్ చేసారు, బాగా నవ్వుకున్నాను అని తెలిపారు. ఇక డైరెక్టర్స్ గురించి మాట్లాడుతూ.. మణిరత్నం గారి సినిమాలంటే ఇష్టం. ఇప్పుడు లోకేష్ కనగరాజ్ ఫిలిం మేకింగ్ నచ్చుతుంది. ఇటీవల లియో, విక్రమ్ సినిమాలు చూసాను. అతని ఫిలిం మేకింగ్ బాగుంది అని అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

తక్కువ సినిమాలతోనే స్టార్ డైరెక్టర్ గా మారి లోకేష్ కనగరాజ్ ఇండియా వైడ్ ఫేమస్ అయ్యారు. ఇక లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ సృష్టించి తన సినిమాలపై ప్రేక్షకులకు ఆసక్తి కల్పించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లోకేష్ గురించి మాట్లాడటంతో వీళ్లిద్దరి కాంబోలో ఓ మాస్ సినిమా పడితే మాత్రం థియేటర్స్ దద్దరిల్లుతాయి అని ఫ్యాన్స్ అంటున్నారు. కానీ పవన్ ఇప్పుడు కొత్తగా సినిమాలు ఒప్పుకునే పరిస్థితిలో లేరని తెలిసిందే.