Pawan Kalyan Joins OG Shooting
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఆయన నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా ముగింపు దశకు చేరుకోగా, తమిళ దర్శకుడు సముద్రఖని డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మూవీలో తన పాత్రకు సంబంధించిన షూట్‌ను ముగించాడు. మరో యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో ‘ఓజి’ అనే సినిమాను కూడా స్టార్ట్ చేశాడు పవన్.
Pawan Kalyan OG : పవన్ కళ్యాణ్ OG రెగ్యులర్ షూట్ స్టార్ట్ అయ్యేది అప్పుడేనా?
ఈ సినిమాను అనౌన్స్ చేసిన దగ్గర్నండీ ఈ మూవీకి సంబంధించి ఎప్పుడు ఎలాంటి అప్డేట్ వచ్చినా అభిమానులు తప్పకుండా ఫాలో అవుతున్నారు. ఇక ఇటీవల ఈ చిత్ర షూటింగ్‌ను ముంబైలో స్టార్ట్ చేసింది చిత్ర యూనిట్. దీంతో ఈ సినిమా షూటింగ్‌లో పవన్ ఎప్పుడు జాయిన్ అవుతాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, తాజాగా పవన్ ఈ చిత్ర షూటింగ్‌లోకి పవర్‌ఫుల్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ మేరకు చిత్ర యూనిట్ అఫీషియల్‌గా ఈ విషయాన్ని వెల్లడించింది. పవన్ తనదైన స్వాగ్‌తో ఈ సినిమాలో ఎంట్రీ ఇస్తున్న ఓ ఫోటోను చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Pawan Kalyan: నాని హీరోయిన్‌తో పవన్ రొమాన్స్.. మామూలుగా ఉండదుగా..?
దీంతో పవన్ ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. పవన్ చాలా రిఫ్రెషింగ్‌గా కనిపిస్తుండటంతో ఈ సినిమాలో ఆయన లుక్స్, పాత్ర ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా, ఈ సినిమాలో అందాల భామ ప్రియాంక ఆరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నట్లుగా చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.
THE #OG HAS ARRIVED on sets… ???#PawanKalyan #TheyCallHimOG #FireStormIsComing@PawanKalyan @sujeethsign @dop007 @MusicThaman #ASPrakash @DVVMovies #FireStormIsComing ?#?????????????? pic.twitter.com/Qv9K9ito4Q
— DVV Entertainment (@DVVMovies) April 18, 2023