×
Ad

Pawan Kalyan : కన్నడ గడ్డ మీద పవన్ క్రేజ్.. OG అరుపులు.. సినిమా రిలీజయినా తగ్గని ఊపు.. వీడియోలు వైరల్..

ఇంకా OG.. OG.. అనే అరుస్తున్నారు. ఆ అరిచేది తెలుగు రాష్ట్రాల్లో కూడా కాదు కర్ణాటక రాష్ట్రంలో.(Pawan Kalyan)

Pawan Kalyan

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ క్రేజ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ రేంజ్ లో ఉంటుందో అందరికి తెలిసిందే. ఇటీవల OG రిలీజయ్యేవరకు ఆ సినిమాకు ఉన్న హైప్ తో పవన్ ఎక్కడికి వెళ్లినా, రాజకీయ సభల్లో కూడా ఫ్యాన్స్ OG.. OG.. అని అరిచేవాళ్ళు. OG రిలీజయి పెద్ద హిట్ అయింది. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. కానీ ఇంకా OG.. OG.. అనే అరుస్తున్నారు. ఆ అరిచేది తెలుగు రాష్ట్రాల్లో కూడా కాదు కర్ణాటక రాష్ట్రంలో.(Pawan Kalyan)

నేడు ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కర్ణాటక చింతామణి పట్టణంలో సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వి. గోపాల గౌడ గారి అమృత మహోత్సవంలో పాల్గొనడానికి ముఖ్య అతిథిగా వెళ్లారు. అయితే అక్కడ పవన్ కళ్యాణ్ స్టేజిపై ఎక్కుతుంటే కర్ణాటక పవన్ ఫ్యాన్స్ OG OG అని అరుపులు మొదలుపెట్టారు. దాదాపు 2 నిమిషాల పాటు పవన్ స్టేజి ఎక్కి కూర్చునే వరకు ఫ్యాన్స్ అలా OG అని అరుస్తూనే ఉన్నారు. అక్కడ ఉన్న రాజకీయ నేతలు, గెస్ట్ లు, కన్నడ ప్రముఖులు ఆ క్రేజ్ ని చూసి ఆశ్చర్యపోయారు.

Also Read : Pawan Kalyan : పవన్ కళ్యాణ్ నే వెయిట్ చేయించిన సినిమాటోగ్రాఫర్.. ఆయన టైం ఇవ్వడమే గగనం అంటే..

దీంతో ఈ వీడియోలు వైరల్ గా మారాయి. తెలుగు రాష్ట్రాల పవన్ ఫ్యాన్స్ ఈ వీడియోలు తెగ షేర్ చేస్తున్నారు. OG సినిమా రిలీజయినా ఇంకా ఆ ఊపు తగ్గలేదని, కర్ణాటకలో కూడా పవన్ క్రేజ్ మాములుగా లేదని, అక్కడి రాజకీయాల్లో కూడా పవన్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్, నెటిజన్లు. పవన్ గత ఎన్నికల్లో సాధించిన విజయ సునామీకి దేశమంతా తిరిగి చూసింది. మోడీ సైతం నేషనల్ లీడర్స్ ముందు పొగడటంతో దేశ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ స్టార్ అయిన సంగతి తెలిసిందే.

 

Also Read : Ravi K Chandran : ఓజీ రిలీజ్ తర్వాత అకిరా నందన్ నాకు ఫోన్ చేసి.. ఓజీ సినిమాటోగ్రాఫర్ కామెంట్స్ వైరల్..