Ravi K Chandran : ఓజీ రిలీజ్ తర్వాత అకిరా నందన్ నాకు ఫోన్ చేసి.. ఓజీ సినిమాటోగ్రాఫర్ కామెంట్స్ వైరల్..

OG సినిమా పెద్ద హిట్ అవ్వడంతో ఈ సినిమాకు సీక్వెల్, ప్రీక్వెల్ కూడా ప్రకటించారు. (Ravi K Chandran)

Ravi K Chandran : ఓజీ రిలీజ్ తర్వాత అకిరా నందన్ నాకు ఫోన్ చేసి.. ఓజీ సినిమాటోగ్రాఫర్ కామెంట్స్ వైరల్..

Ravi K Chandran

Updated On : October 6, 2025 / 10:55 AM IST

Ravi K Chandran : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల OG సినిమాతో పెద్ద హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. దాదాపు 300 కోట్ల గ్రాస్ వసూలు చేసి OG సినిమా 2025 హైయెస్ట్ గ్రాసర్ తెలుగు సినిమాగా నిలిచింది. ఈ సినిమా హైప్, సినిమాలో విజువల్స్, పవన్ కళ్యాణ్ స్టైల్.. కొన్నాళ్ల పాటు పవన్ ఫ్యాన్స్ ని నిద్రలేకుండా సంతోషంలో ముంచేసాయి. టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం OG ప్రీమియర్స్ కి క్యూ కట్టారు. చిన్న హీరోల నుంచి మెగాస్టార్ వరకు అంతా OG సినిమాని అభినందించారు.(Ravi K Chandran)

OG సినిమా పెద్ద హిట్ అవ్వడంతో ఈ సినిమాకు సీక్వెల్, ప్రీక్వెల్ కూడా ప్రకటించారు. ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా ప్లస్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ ని స్టైలిష్ గా చూపించడమే కాక లొకేషన్స్ ని కూడా అద్భుతంగా చూపించారు. తాజాగా OG సినిమాటోగ్రాఫర్ రవిచంద్రన్ ఓ ఇంటర్వ్యూలో OG సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.

Also See : Anshula Kapoor : జాన్వీ కపూర్ అక్క నిశ్చితార్థం.. సందడి చేసిన ఫ్యామిలీ.. ఫొటోలు వైరల్..

ఈ క్రమంలో OG సినిమా విజువల్స్ కి మంచి పేరు వచ్చింది కదా మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి అని రవిచంద్రన్ ని అడగ్గా.. పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ OG సినిమా చూశాక వెంటనే నాకు ఫోన్ చేసి మా నాన్నని చాలా బాగా చూపించారు. సినిమాలో చాలా స్టైలిష్ గా ఉన్నారు నాన్న అని కంగ్రాట్స్ చెప్పాడు. ఆ మాటలు నాకు చాలా తృప్తినిచ్చాయి అని తెలిపారు.

దీంతో ఈ కామెంట్స్ వైరల్ అవ్వగా OG సినిమాలో పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్స్ ఫ్యాన్స్ మాత్రమే కాదు సాధారణ ప్రేక్షకులకు కూడా నచ్చాయి అలాంటిది కొడుక్కి నచ్చావా అని సరదాగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

Also Read : Bunny Vasu : అల్లు అర్జున్ – పవన్ కళ్యాణ్ ఇష్యూ.. నాకు ఫోన్స్ చేసి వాళ్ళతో మాట్లాడమనేవాళ్ళు.. బన్నీ వాసు కామెంట్స్ వైరల్..