Pawan Kalyan : 20 ఏళ్లుగా ఒకే బ్రాండ్ డ్రెస్సులు మెయింటైన్ చేస్తున్న పవన్.. వాటి కాస్ట్ ఎంతో తెలుసా?

ఇటీవల పవన్ ఓ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కలర్ ఫుల్ బ్రాండెడ్ డ్రెస్ లో కనిపించారు.

Pawan Kalyan

Pawan Kalyan : సెలబ్రిటీలు కాస్త ఖర్చుపెట్టి బ్రాండెడ్ బట్టలే వేస్తారు. కొంతమందికి కంఫర్ట్ ఉండటంతో రెగ్యులర్ గా ఒకే బ్రాండ్ ని వాడతారు. అలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆల్మోస్ట్ 20 ఏళ్లకు పైగా ఒకే బ్రాండ్ డ్రెస్ లు ఎక్కువగా వాడుతున్నారు. ముఖ్యంగా కోట్, ప్యాంట్, హుడీ.. టైప్ డ్రెస్ లను పవన్ కళ్యాణ్ ‘స్టోన్ ఐస్ ల్యాండ్’ అనే కంపెనీకి చెందినవే వాడుతున్నాడు.

ఇటీవల పవన్ ఓ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కలర్ ఫుల్ బ్రాండెడ్ డ్రెస్ లో కనిపించారు. పవన్ వేసుకున్న షర్ట్, ప్యాంట్ మీద స్టోన్ ఐస్ ల్యాండ్ లోగో ఉంది. దీంతో ఫ్యాన్స్ ఆ బ్రాండ్ గురించి తెగ వెతికారు. గతంలోనే పవన్ ఈ బ్రాండ్ డ్రెస్ లను పలుమార్లు వేసుకున్నారు. గుడుంబా శంకర్, బాలు, బంగారం సినిమాల్లో కూడా పవన్ ఈ బ్రాండ్ డ్రెస్ లను వేశారు. బయట కూడా పలు ఈవెంట్స్ లో ఈ బ్రాండ్ డ్రెస్ లను వేసుకొచ్చారు. ఈ బ్రాండ్ డ్రెస్ లను ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో వాడుతున్నట్టు తెలుస్తుంది.

Also Read : Jwala Gutta : ‘గుత్తా జ్వాల’ కూతురు బారసాల.. పేరు పెట్టిన అమీర్ ఖాన్.. ఫొటోలు చూశారా?

దీంతో ఫ్యాన్స్ గతంలో పవన్ ఈ బ్రాండ్ తో వేసుకున్న డ్రెస్ లను వెతికి పట్టి మరీ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. స్టోన్ ఐస్ ల్యాండ్ షర్ట్స్ ధర 20 వేల నుంచి మొదలుకొని లక్ష రూపాయల పైనే ఉన్నాయి. ఆన్లైన్ లో కూడా కొనుక్కోవచ్చు. ఇది 1982 లో మొదలైన ఇటలీకి చెందిన కంపెనీ. పవన్ కళ్యాణ్ ఈ బ్రాండ్ షర్ట్ వేయడంతో ఒక్కరోజులో సోషల్ మీడియాలో ఈ బ్రాండ్ తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అయిపోయింది.

Pawan Kalyan

Also Read : Dhanya Balakrishna : నా బిగ్గెస్ట్ డ్రీమ్.. ఆయనతో ఫోటో దిగాలని 12 ఏళ్లుగా కల.. మాతో మాట్లాడి అడిగి మరీ..