Dhanya Balakrishna : నా బిగ్గెస్ట్ డ్రీమ్.. ఆయనతో ఫోటో దిగాలని 12 ఏళ్లుగా కల.. మాతో మాట్లాడి అడిగి మరీ..

తాజాగా నటి ధన్య బాలకృష్ణ పవన్ ని కలవడంతో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Dhanya Balakrishna : నా బిగ్గెస్ట్ డ్రీమ్.. ఆయనతో ఫోటో దిగాలని 12 ఏళ్లుగా కల.. మాతో మాట్లాడి అడిగి మరీ..

Dhanya Balakrishna

Updated On : July 7, 2025 / 2:56 PM IST

Dhanya Balakrishna : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి తెలుగు రాష్ట్రాల్లో ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికి తెలిసిందే. ఆయన్ని ఒక్కసారైనా చూస్తే చాలు, ఆయనతో ఫోటో వస్తే బాగుండు అనుకునేవాళ్లు కోట్లలో ఉన్నారు. చాలా మంది సెలబ్రిటీలు కూడా ఆయన అభిమానులే. తాజాగా నటి ధన్య బాలకృష్ణ పవన్ ని కలవడంతో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఇటీవల పవన్ కళ్యాణ్ RK సాగర్ ది 100 సినిమా ట్రైలర్ ని లాంచ్ చేసారు. ఈ సినిమాలో ధన్య బాలకృష్ణ నటించింది. దీంతో ట్రైలర్ లాంచ్ కి మూవీ యూనిట్ తో పాటు ధన్య కూడా పవన్ దగ్గరకు వెళ్ళింది. పవన్ తో ఫోటో దిగింది. ఆ ఫోటోని తన సోషల్ మీడియాలో పంచుకొని స్పెషల్ మూమెంట్ అని తెలిపింది.

Also Read : Venkatesh : చిరుతోనే కాదు.. బాలయ్యతో కూడా వెంకీమామ సినిమా.. ఫ్యాన్స్ కి పండగ..

నిన్న ఆదివారం నాడు ది 100 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా ఈ ఈవెంట్లో ధన్య బాలకృష్ణ మాట్లాడుతూ.. నేను 12 ఏళ్ళ నుంచి పవన్ కళ్యాణ్ గారిని కలవాలి, ఆయనతో ఫోటో దిగాలి అనుకుంటున్నాను. ఆ కల సాగర్ గారి ద్వారా తీరింది. అది మాకు పెద్ద గిఫ్ట్, వరం లాంటిది. నాకు అది స్పెషల్ డే. మా టీమ్ కి పవన్ గారిని చూడగానే కళ్ళు తిరిగి పడిపోతానేమో నన్ను పట్టుకోండి అని చెప్పాను. నా బిగ్గెస్ట్ డ్రీం ఆయన్ని కలవడం. కానీ ఆయన వచ్చాక చాలా ప్రశాంతంగా ఉంది. ఆయన అందర్నీ పలకరించి మా గురించి అడిగి, మాతో మాట్లాడి అడిగి మరీ ఫోటో ఇచ్చారు. టీమ్ అంతా దిగాం కానీ మాకు సింగిల్ గా ఫోటో కావాలని పిచ్చి. జరుగుద్దో లేదో అనుకున్నా. కానీ ఆయనే అందర్నీ పిలిచి ఒక్కొక్కరికి ఫోటోలు ఇచ్చారు. అతిథి దేవో భవ అన్నట్టు చూసారు అని తెలిపింది.

 

Also Read : Kantara Chapter 1 : కాంతార ప్రీక్వెల్ రిలీజ్ డేట్ వ‌చ్చేసింది..