Kantara Chapter 1 : కాంతార ప్రీక్వెల్ రిలీజ్ డేట్ వచ్చేసింది..
కాంతార ప్రీక్వెల్ మూవీ విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించింది.

Rishab Shetty Kantara Chapter 1 movie release on October 2nd
ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయం సాధించిన కన్నడ చిత్రం కాంతార. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో సప్తమి గౌడ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం 25 కోట్ల బడ్జెట్‌తో రూపొంది ప్రపంచ వ్యాప్తంగా 400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇక ఈ చిత్రానికి ప్రీక్వెల్‌గా కాంతార చాప్టర్-1 తెరకెక్కుతోంది.
తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించింది. ఈ మూవీని 2025 అక్టోబర్ 2న రిలీజ్ చేస్తామని అధికారికంగా ప్రకటించారు.
లోకల్ ట్రైన్ నుంచి దూకి చనిపోవాలనుకుంది.. ఇప్పుడు స్టార్ హీరోయిన్..
View this post on Instagram
ఇటీవల 500 మంది యోధులతో ఓ యుద్ద సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఈ ఫైట్ సీక్వెన్స్‌లో దాదాపు 3 వేల మంది భాగం అయ్యారు. ఈ ఫైట్ సీక్వెన్స్ కోసం మూడు నెలల పాటు రిషబ్ గుర్రపు స్వారీ, కలరి, కత్తి యుద్ధం వంటివి నేర్చుకున్నారు. దాదాపు 50 రోజుల పాటు కర్ణాటకలోని పర్వత ప్రాంతాల్లో ఈ యుద్ద సన్నివేశాన్ని చిత్రీకరించారు. మూవీలో ఈ సీక్వెన్స్ కీలకం అని తెలుస్తోంది.