లోకల్ ట్రైన్ నుంచి దూకి చనిపోవాలనుకుంది.. ఇప్పుడు స్టార్ హీరోయిన్..
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపింది.

actress
Mrunal Thakur : ఇప్పుడు సక్సెస్ తో దూసుకుపోతున్న వాళ్లంతా ఒకప్పుడు కష్టాలు పడిన వాళ్ళే. అందులోను సినీ పరిశ్రమలో అయితే ఇంకా ఎక్కువ కష్టాలు పడి చాలా తక్కువమంది సక్సెస్ అవుతారు. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ తన కెరీర్ ఆరంభంలో అవకాశాలు రాక చనిపోవాలనుకుందట. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపింది.
ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరా అనుకుంటున్నారా? ఆ హీరోయిన్ ఎవరో కాదు సీతారామం సినిమాతో ఒక్కసారిగా స్టార్ డమ్ తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్. తాజాగా మృణాల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సీరియల్స్ తో గుర్తింపు వచ్చాక సినిమా ప్రయత్నాలు చేశాను. సినిమాలకు ఆడిషన్స్ కి వెళ్ళినప్పుడు టీవీ నటి అని చులకనగా చూసేవాళ్ళు. దాని వల్ల డిప్రెషన్ కి కూడా గురయ్యాను. ఓ సారి ఆ డిప్రెషన్ తట్టుకోలేక లోకల్ ట్రైన్ నుంచి దూకి చనిపోవాలని అనుకున్నా కానీ పేరెంట్స్ గుర్తొచ్చి ఆగిపోయాను అని తెలిపింది.
Also Read : Sara Arjun : అప్పటి చిన్న పాప.. ఇప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ.. ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో పక్కన..
మృణాల్ చిన్నప్పట్నుంచి నటి అవ్వాలనుకుంది. మొదట సీరియల్స్ లో అవకాశం వచ్చింది. కుంకుమ భాగ్య సీరియల్ తో బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అప్పుడు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేస్తూనే హీరోయిన్ పాత్రల కోసం ట్రై చేసేది. సూపర్ 30, జెర్సీ హిందీ సినిమాలతో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది మృణాల్. అదే టైంలో సీతా రామం సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా మృణాల్ కెరీర్ నే మార్చేసింది.
సీతారామం తర్వాత మృణాల్ తెలుగు, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్తుంది. ప్రస్తుతం తన చేతిలో హిందీ, తెలుగులో కలిపి దాదాపు అరడజను సినిమాలు ఉన్నాయి. అందులో అడివి శేష్ డెకాయిట్, అల్లు అర్జున్ అట్లీ సినిమాలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు అవకాశాలు లేక చనిపోవాలనుకున్న మృణాల్ ఇవాళ స్టార్ హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది.
Also Read : OG Theatrical Rights : హరిహర వీరమల్లు ఇంకా రిలీజ్ అవ్వలేదు.. అప్పుడే OG థియేటరికల్ రైట్స్ కోసం పోటీ..