Pawan Kalyan met PM Modi along with his wife and son
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అఖండ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. కూటమి విజయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రధాన పోషించారు. కాగా.. ఎన్డీఏ సమావేశంలో పాల్గొనేందుకు తన భార్య అన్నా లెజినోవా, కుమారుడు అకిరా నందన్‌తో కలిసి పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లారు.
ప్రధాని నివాసంలో నరేంద్ర మోదీని కలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ తన కుమారుడు అకిరా నందన్‌ను మోదీకి కి పరిచయం చేశారు. అకిరా కూడా ప్రధానికి చేతులు జోడించి నమస్కరించాడు. ఈ సందర్భంగా మోదీ అకిరా నందన్ మీద చేయి వేసి మాట్లాడుతున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
2014లో జనసేనను స్థాపించారు పవన్. 2019లో మొదటి సారి ప్రత్యక్ష ఎన్నికలకు వెళ్లారు. ఆ సమయంలో ఆయనకు దారుణ పరాజయం ఎదురైంది. అయితే.. 2024లో 21 సీట్లలో పోటీ చేసి 21 మందిని గెలిపించుకుని సగర్వంగా అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. దీనికి రెండు పార్లమెంట్ స్థానాలు కూడా అదనం. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఏర్పాటు కావడంలో పవన్ చొరవే కారణం అని అంతా అనుకుంటున్నారు.
Also Read: సినీ నటి హేమకు బిగ్ షాక్.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుండి సస్పెండ్..