Pawan Kalyan – Anjanamma : పవన్ రోడ్డు మీద అలా పడుకున్నప్పుడు చాలా బాధేసింది.. పవన్ తల్లి అంజనమ్మ వ్యాఖ్యలు..

ప్రస్తుతం అంజనమ్మ ఇంటర్వ్యూ ప్రోమో వైరల్ గా మారింది.

Pawan Kalyan Mother Anjanamma Interesting Comments Video goes Viral

Pawan Kalyan – Anjanamma : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో డిప్యూటీ సీఎంగా, మంత్రిగా బిజీగా ఉన్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ తల్లి అంజనమ్మని స్పెషల్ ఇంటర్వ్యూ చేసారు. దీనికి సంబంధించిన ప్రోమోని జనసేన పార్టీ ఛానల్ లో రిలీజ్ చేసారు.

ఈ ప్రోమోలో యాంకర్ పవన్ కళ్యాణ్ రోడ్డు మీద పడుకున్న సంఘటనను గుర్తు చేయడంతో అంజనమ్మ మాట్లాడుతూ.. అలా రోడ్డు మీద ఆపితే అక్కడే పడుకున్నప్పుడు చాలా బాధ కలిగింది. పట్టుదల ఎక్కువ చిన్నప్పట్నుంచి కూడా. ఇది చేయాలి అంటే చేసేసేవాడు అని పవన్ గురించి మాట్లాడింది. పవన్ చంద్రబాబు అరెస్ట్ అయిన సమయంలో హైదరాబాద్ నుంచి వెళ్తుంటే జగ్గయ్యపేట వద్ద పోలీసులు అడ్డుకోగా అప్పుడు పవన్ రోడ్డు మీదే పడుకొని ప్రొటెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ ఘటనని ఉద్దేశించి అంజనమ్మ ఇలా మాట్లాడారు.

Also Read : Pawan Kalyan : తమిళ్‌లో తన ఫేవరేట్ డైరెక్టర్ ఎవరో చెప్పిన పవర్ స్టార్.. వీళ్లిద్దరి కాంబినేషన్లో సినిమా పడితే..

ప్రస్తుతం అంజనమ్మ ఇంటర్వ్యూ ప్రోమో వైరల్ గా మారింది. ఇంటర్వ్యూలో అంజనమ్మ పవన్ కళ్యాణ్ గురించి ఇంకేమి విషయాలు చెప్పారో అని మెగా ఫ్యాన్స్, జనసైనికులు ఈ ఫుల్ ఇంటర్వ్యూ కోసం ఎదురుచూస్తున్నారు. ఫుల్ ఇంటర్వ్యూ త్వరలో జనసేన ఛానల్ లో అమ్మమనసు పేరుతో రిలీజ్ కానుంది. మీరు కూడా ఒకసారి ఈ ఇంటర్వ్యూ ప్రోమో చూసేయండి..