Pawan Kalyan Movie Shootings Break with Chandrababu Naidu Arrest AP Politics
Pawan Kalyan Movies : ఏపీలో చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్ జరగడంతో రాష్ట్రం అట్టుడుకుతోంది. ఇప్పటికే పలువురు టీడీపీ (TDP) నాయకులు, కార్యకర్తలు నిరసనలు తెలియచేస్తున్నారు. ప్రతిపక్షాలు అన్ని కూడా చంద్రబాబుకి మద్దతు ప్రకటించాయి. పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు అరెస్ట్ ని ఖండిస్తూ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఇటువంటి సమయంలో ఏపీలో అడగుపెట్టడానికి నిన్న అర్ధరాత్రి చాలానే హైడ్రామా జరిగింది.
అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. తన రాజకీయ షెడ్యూల్స్ మధ్య పవన్ సినిమా షూటింగ్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో వారాహి మూడో యాత్ర అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) షూటింగ్ కి డేట్స్ ఇచ్చారు. షూటింగ్ జరుగుతుండగానే మధ్యలో నిన్న పవన్ ఏపీకి బయలుదేరారు. చంద్రబాబు అరెస్ట్ వల్ల పవన్ ఏపీకి వెళ్లలేదని, జనసేన పార్టీ మీటింగ్స్ ఉన్నాయని జనసేన నాయకులు అంటున్నారు.
ప్రస్తుతం పవన్ నిన్నటి నుంచి మరోసారి షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఓ పక్క పార్టీ మీటింగ్స్, మరో పక్క చంద్రబాబు అరెస్ట్ తో ఏపీలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పవన్ అక్కడే మంగళగిరిలో ఉండి పరిశీలించబోతున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ చంద్రబాబు అరెస్ట్ అయి జైలుకి వెళ్తే ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయి. పవన్ మళ్ళీ ఇప్పట్లో షూటింగ్స్ కి వెళ్లే సూచనలు కనిపించట్లేదు. దీంతో చంద్రబాబు అరెస్ట్ పవన్ సినిమా షూటింగ్స్ కి ముడిపడింది. మరి పవన్ ఇప్పట్లో మళ్ళీ షూట్ చేస్తారా? అనుకున్నట్టు ఎలక్షన్స్ ముందే చేతిలో ఉన్న మూడు సినిమాల షూట్స్ పూర్తి చేస్తారా చూడాలి. ఈ విషయంలో మాత్రం పవన్ అభిమానులు నిరాశ చెందుతున్నారు.