Mahesh Babu : రివ్యూయర్‌గా మారిపోతున్న మహేష్ బాబు.. మొన్న జవాన్.. ఇప్పుడు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి..

ఇప్పుడు మహేష్ బాబు మరీ పూర్తిగా రివ్యూయర్‌గా మారిపోతున్నాడని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

Mahesh Babu : రివ్యూయర్‌గా మారిపోతున్న మహేష్ బాబు.. మొన్న జవాన్.. ఇప్పుడు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి..

Mahesh Babu Reviews on Jawan and Miss Shetty Mr Polishetty Movies goes viral

Updated On : September 10, 2023 / 11:34 AM IST

Mahesh Babu : మహేష్ బాబు తనకి ఏదైనా సినిమా లేదా వెబ్ సిరీస్(Web Series) నచ్చితే దాని గురించి ట్విట్టర్ లో షేర్ చేసుకుంటాడు. కరోనా సమయంలో లాక్ డౌన్ పెట్టినప్పటి నుంచి మహేష్ ఇలా చేస్తున్నారు. లాక్ డౌన్ లో పలు సిరీస్ లు కూడా సజెస్ట్ చేశాడు చూడమని. అప్పట్నుంచి ఏదైనా సినిమా నచ్చితే సినిమా గురించి ట్వీట్ చేస్తున్నాడు మహేష్. ఇక ఎవరైనా సినిమా ప్రమోషన్స్ కోసం మహేష్ ని అప్రోచ్ అయితే నో చెప్పకుండా చేస్తున్నాడు.

అయితే ఇప్పుడు మహేష్ బాబు మరీ పూర్తిగా రివ్యూయర్‌గా మారిపోతున్నాడని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇటీవల షారుఖ్(Shahrukh Khan) జవాన్(Jawan) సినిమా రాగా సినిమా రిలీజ్ ముందు టీంకి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఓ ట్వీట్ వేశాడు. దీనికి షారుఖ్ కూడా రిప్లై ఇచ్చాడు. జవాన్ సినిమా చూసిన తర్వాత మహేష్ బాబు రివ్యూ కూడా ఇచ్చాడు. మహేష్ బాబు జవాన్ సినిమా చూసి.. బ్లాక్ బస్టర్ సినిమా జవాన్. కింగ్ తో అట్లీ కింగ్ సైజ్ ఎంటర్టైన్మెంట్ సినిమా ఇచ్చాడు. షారుఖ్ ఖాన్ కెరీర్ బెస్ట్ ఫిలిం ఇది. షారుఖ్ ఆరా, స్క్రీన్ ప్రెజెన్స్ ఎవ్వరూ మ్యాచ్ చేయలేరు. షారుఖ్ మంచి ఫైర్ మీద ఉన్నాడు. జవాన్ సినిమా షారుఖ్ సొంత సినిమా రికార్డులనే బద్దలు కొడుతుంది. లెజెండ్ అని పొగుడుతూ.. ఒక అభిమాని రివ్యూ ఇచ్చినట్టు పోస్ట్ చేశాడు. దీనికి షారుఖ్ కూడా రిప్లై ఇచ్చాడు. మహేష్ బాబు షారుఖ్ జవాన్ సినిమా గురించి ఈ రేంజ్ లో పోస్ట్ చేయడంతో ఇది వైరల్ గా మారింది.

తాజాగా ఇప్పుడు మహేష్ బాబు మరో సినిమా గురించి పోస్ట్ చేశాడు. జవాన్ సినిమా రిలీజ్ రోజే తెలుగులో నవీన్ పోలిశెట్టి, అనుష్క కలిసి నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి(Miss Shetty Mr Polishetty) సినిమా కూడా రిలీజయింది. ఈ సినిమా కూడా ప్రేక్షకులని మెప్పించి మంచి విజయం సాధించింది. తాజాగా మహేష్ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా చూసి.. సినిమా పూర్తిగా నవ్వుకోవచ్చు. ఫ్యామిలీతో కలిసి ఫుల్ గా ఎంజాయ్ చేశాం. నవీన్ పోలిశెట్టి కామిక్ టైమింగ్ అదిరిపోయింది. అనుష్క శెట్టి ఎప్పటిలాగే బ్రిలియంట్. నిర్మాతలు, దర్శకుడికి, చిత్రయూనిట్ కి సినిమా సక్సెస్ అయినందుకు అభినందనలు అని పోస్ట్ చేశారు. దీనికి నవీన్ పోలిశెట్టి, చిత్రయూనిట్ కూడా రిప్లైలు ఇచ్చారు.

Bhola Shankar : మెగాస్టార్ భోళా శంకర్ ఓటీటీ సెట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడు?

ఇలా వరుసగా రిలీజయిన ప్రతి సినిమా చూసేసి మహేష్ బాబు సాధారణ ప్రేక్షకుడిలా రివ్యూలు ఇస్తున్నాడని కొంతమంది కామెంట్స్ చేస్తుంటే, మరికొంతమంది మాత్రం మహేష్ అన్ని సినిమాలని ఎంకరేజ్ చేస్తారు అని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి మహేష్ రివ్యూలు మాత్రం వైరల్ అవుతున్నాయి. నెక్స్ట్ వచ్చే సినిమాలకు కూడా మహేష్ ఇలాగే సినిమాలు చూసి రివ్యూలు ఇస్తారా అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.