Pawan Kalyan movie Villain play antagonist role in Adivi Sesh G2 movie
Adivi Sesh : టాలీవుడ్ హీరో అడివి శేష్.. ‘కర్మ’ సినిమాని డైరెక్ట్ చేస్తూ నటించి హీరోగా ఆడియన్స్ కి పరిచయం అయ్యారు. కానీ ఆ మూవీతో పెద్దగా గుర్తింపు లంభించలేదు. ఇక ఆ తరువాత పవన్ కళ్యాణ్ ‘పంజా’ సినిమాలో విలన్ గా నటించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ మూవీలోని అడివి శేష్ పాత్ర.. చాలామంది ఆడియన్స్ కి ఇప్పటికి గుర్తుండి పోయింది. ఇలా గుర్తు పెట్టుకున్న ఓ ప్రేక్షకుడు ఇటీవల ఆ పాత్ర గురించి ట్వీట్ చేయగా, అడివి శేష్ కూడా రిప్లై ఇచ్చారు.
Manushulu manchollamma. Manishantene manchollu ?❤️ https://t.co/33D2dJBlJn
— Adivi Sesh (@AdiviSesh) February 4, 2024
ఇక పంజా తరువాత పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ వచ్చిన అడివి శేష్.. ‘క్షణం’తో సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తరువాత గూఢచారి, ఎవరు, హిట్ వంటి థ్రిల్లర్ మూవీస్‌తో.. టాలీవుడ్ జేమ్స్‌బాండ్ అనిపించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు తన బ్లాక్ బస్టర్ మూవీ గూఢచారికి ‘G2’ అంటూ సీక్వెల్ ని సిద్ధం చేస్తున్నారు. ఈ మూవీ పై ఆడియన్స్ లో భారీ అంచనాలే నెలకొన్నాయి.
Also read : Anushka Shetty : పవన్ కళ్యాణ్ దర్శకుడితో అనుష్క కొత్త సినిమా.. ప్రభాస్‌ని దాటి రావడం లేదుగా..
అడివి శేష్ కథని అందిస్తూ నటించిన గూఢచారి.. 2018లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్టుని అందుకుంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన టాలీవుడ్ మూవీస్‌లో.. ఇదే ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇక మొదటి మూవీకి ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని అడివి శేష్.. సెకండ్ పార్టుని సిద్ధం చేస్తున్నారు. ఈ సీక్వెల్ ని వినయ్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ మూవీలో అడివి శేష్ కి శత్రువుగా పవన్ కళ్యాణ్ విలన్ కనిపించబోతున్నారట.
బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మి.. పవన్ కళ్యాణ్ OG సినిమాలో విలన్ గా నటిస్తూ తెలుగు ఆడియన్స్ కి పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అడివి శేష్ గూఢచారి 2లో కూడా ఇమ్రాన్ హష్మినే విలన్ గా కనిపించబోతున్నారట. దీంతో ఈ మూవీకి బాలీవుడ్ లో కూడా మంచి మార్కెట్ జరిగే అవకాశం ఉంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రాబోతుంది.