Anushka Shetty : పవన్ కళ్యాణ్ దర్శకుడితో అనుష్క కొత్త సినిమా.. ప్రభాస్‌ని దాటి రావడం లేదుగా..
పవన్ కళ్యాణ్ దర్శకుడితో అనుష్క కొత్త సినిమాతో రాబోతున్నారట. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే.. బాహుబలి నుంచి అనుష్క ప్రభాస్‌ని దాటి రావడం లేదు.

Anushka Shetty new movie with pawan kalyan director in prabhas production
Anushka Shetty : టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి.. చాలా గ్యాప్ తరువాత ఇటీవల ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చి సూపర్ హిట్టుని అందుకుంది. ప్రస్తుతం మలయాళంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా తెలుగులో ఓ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పారట. ఆ సినిమా కూడా ప్రభాస్ హోమ్ ప్రొడక్షన్ బ్యానర్ యూవీ క్రియేషన్స్ లోనే ఉండబోతుంది. బాహుబలి నుంచి అనుష్క ప్రభాస్‌ని దాటి రావడం లేదు.
బాహుబలి తరువాత నుంచి అనుష్క చేస్తున్న తెలుగు సినిమాలు అన్ని యూవీ క్రియేషన్స్ లోనే ఉంటున్నాయి. ఇప్పుడు కొత్త సినిమాని కూడా యూవీ క్రియేషన్స్ లోనే చేయబోతున్నారు. ఇక ఈ సినిమాని పవన్ కళ్యాణ్ సినిమా దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించబోతున్నారట. ప్రస్తుతం క్రిష్, పవన్‌తో ‘హరిహర వీరమల్లు’ చేస్తున్న సంగతి తెలిసిందే. గత నాలుగేళ్లుగా ఆ మూవీ సెట్స్ పైనే ఉంది.
Also read : Yatra 2 Twitter Review : యాత్ర 2 ట్విట్టర్ రివ్యూ ఎలా ఉంది.. ఆడియన్స్ టాక్ ఏంటి..?
దాదాపు 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఆ చిత్రం.. మిగిలిన బ్యాలన్స్ కంప్లీట్ చేసుకోవడానికి తెగ కష్ట పడుతుంది. పవన్ ఈ సినిమాకి తప్ప, మిగిలిన చిత్రాలకు డేట్స్ ఇచ్చి పూర్తి చేస్తున్నారు. ఇక పవన్ డేట్స్ ఇవ్వకపోవడంతో.. క్రిష్ ఈ మధ్యలో ‘కొండపోలం’ అనే సినిమా డైరెక్ట్ చేసి రిలీజ్ కూడా చేసేశారు. ఇప్పుడు మరో మూవీని కూడా డైరెక్ట్ చేయడానికి సిద్దమవుతున్నారట.
అనుష్క ప్రధాన పాత్రలో క్రిష్ ఓ సినిమా డైరెక్ట్ చేస్తున్నారట. ఆల్రెడీ షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యినట్లు సమాచారం. ఇక ఈ మూవీని యూవీ క్రియేషన్స్ త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. కాగా క్రిష్, అనుష్క కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ.. ఏ జోనర్ లో ఉండబోతుందో అనే ఆసక్తి మొదలయింది. అయితే అనుష్క గతంలోనే క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ‘వేదం’ సినిమాలో నటించారు.