యాత్ర 2 మూవీ ట్విటర్ రివ్యూ ఎలా ఉంది.. ఆడియన్స్ టాక్ ఏంటి..?

జగన్ మోహన్ రెడ్డి బయోపిక్ తో ఆడియన్స్ ముందుకు వచ్చిన యాత్ర 2 ట్విట్టర్ రివ్యూ ఎలా ఉంది.. ఆడియన్స్ టాక్ ఏంటి..?

యాత్ర 2 మూవీ ట్విటర్ రివ్యూ ఎలా ఉంది.. ఆడియన్స్ టాక్ ఏంటి..?

Jiiva as YS Jagan Mohan Reddy Yatra 2 Twitter Review public talk

Updated On : February 8, 2024 / 11:38 AM IST

Yatra 2 Twitter Review : 2019లో వైఎస్సార్ బయోపిక్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమా ‘యాత్ర’. మహి వి రాఘవ్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా మంచి విజయం సాధించడంతో.. ఇప్పుడు ఆ మూవీ సీక్వెల్ ని జగన్ మోహన్ రెడ్డి బయోపిక్ తో ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. మొదటి సినిమాలో మమ్ముట్టి వైఎస్సార్ పాత్రలో, జీవా జగన్ పాత్రలో నటించారు. నేడు ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

ఇక ఈ సినిమా చూసిన అభిమానులు.. తమ రివ్యూలను సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. వైఎస్సార్, జగన్ పాత్రల్లో మమ్ముట్టి, జీవా జీవించేసినట్లు చెబుతున్నారు. డైలాగ్స్ చాలా గట్టిగా పేలినట్లు, సినిమాటోగ్రఫీ అయితే సూపర్బ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక దర్శకుడు పనితనం విషయానికి వస్తే.. స్క్రీన్ ప్లే అదిరిపోయిందట. కొన్ని ఎలివేషన్ సీన్స్ గూస్‌బంప్స్ తెప్పిస్తాయట.

Also read : విశ్వక్ సేన్ అవతారం చూసి.. ధర్మం చేసిన ప్రజలు..

యాత్ర 1 బయోపిక్స్ లో ఒక బెస్ట్ మూవీగా నిలిచిపోయింది. ఇప్పుడు ఈ యాత్ర 2 కూడా అదే తరహాలో బెస్ట్ మూవీగా ఉందని, దర్శకుడు మహి వి రాఘవ్ చాలా బాగా తెరకెక్కించారని చెబుతున్నారు. జగన్ ఇంట్రడక్షన్ సీన్ దగ్గర నుంచి చాలా సీన్స్ గూస్‌బంప్స్ తెప్పించేలా ఉన్నాయని చెబుతున్నారు.

అలాగే మహి వి రాఘవ్ ఎలివేషన్స్‌కి సంతోష్ నారాయణ్ బీజీఎమ్‌ అదిరిపోయిందని, ఒక మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరెన్స్ అని చెబుతున్నారు. మూవీలో ఎలివేషన్స్ తో పాటు ఎమోషన్ కూడా చాలా బాగా క్యారీ అయ్యినట్లు పేర్కొంటున్నారు. ముఖ్యంగా డైలాగ్స్ అయితే థియేటర్ లో చాలా బాగా పేలినట్లు చెబుతున్నారు.