Vishwak Sen : విశ్వక్ సేన్ అవతారం చూసి.. ధర్మం చేసిన ప్రజలు..
విశ్వక్ సేన్ అవతారం చూసి కొడ్నహ్రూ ప్రజలు ధర్మం చేశారట.

Vishwak Sen shares memory of gaami movie shooting days
Vishwak Sen : టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్.. ప్రస్తుతం మూడు సినిమాలను తన లైనప్ లో సిద్ధం చేస్తున్నారు. ఇక ఈ మూడు సినిమాల్లో మూడు డిఫరెంట్ రోల్స్ అండ్ గెటప్స్ లో కనిపించబోతున్నారు. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాలో గోదారి కుర్రాడిగా హాఫ్ హెయిర్ కట్‌తో కనిపించనున్నారు. VS10 సినిమాలో మాస్ లుక్ లో దర్శనమివ్వనున్నట్లు సమాచారం. ఇక ‘గామి’ సినిమాలో అఘోరగా కనబడనున్నారు.
ఈ మూవీ షూటింగ్ గత నాలుగేళ్లుగా సాగుతూనే ఉంది. ఇప్పుడు ఓ కొలిక్కి వచ్చి రిలీజ్ కి సిద్దమవుతుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలు పెట్టింది. ఫస్ట్ లుక్ అండ్ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్స్ తో సందడి చేస్తుంది. అలాగే పలు ఇంటర్వ్యూల్లో విశ్వక్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ వస్తున్నారు. హిమాలయాలు, వారణాసి, కుంభమేళా.. ఇలా రియల్ లొకేషన్స్ లో సినిమా తెరకెక్కించడం వలనే చిత్రీకరణ నాలుగేళ్లు పట్టినట్లు చెప్పుకొచ్చారు.
Also read : Kamal Haasan : కమల్ హాసన్, శృతిహాసన్ కాంబినేషన్‌లో.. లోకేష్ కానగరాజ్ సినిమా రాబోతోందా..!
ఇక ఈ మూవీ షూటింగ్ సమయంలో అఘోరగా కనిపించే విశ్వక్ సేన్ చూసి.. నిజంగా అఘోర అనుకోని కొంతమంది ధర్మం చేసేవారట. ఈ విషయాన్ని గామి రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ ఈవెంట్ లో విశ్వక్ చెప్పుకొచ్చారు. మరి స్క్రీన్ పై అఘోరగా విశ్వక్ ఎలా మెప్పిస్తారో చూడాలి. కాగా ఈ సినిమాలో చాందిని చౌదరి, అభినయ, మహ్మద్ సమద్, దయానంద్ రెడ్డి, హారికా తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమా కథ.. చాలా కొత్తగా ఉంటుందని చెబుతున్నారు.
ఈ మూవీ స్టోరీ లైన్ ని ఒక స్టేట్‌మెంట్ ద్వారా మేకర్స్ తెలియజేస్తున్నారు. “అతని అతిపెద్ద భయం మానవ స్పర్శ. అతని లోతైన కోరిక కూడా మానవ స్పర్శే” అనే స్టేట్‌మెంట్ మూవీ పై ఆసక్తి కలిగిస్తుంది. కాగా ఈ మూవీని మార్చి 8న రిలీజ్ చేయబోతున్నారు. ఆరోజు రావాల్సిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ పోస్టుపోన్ అవ్వడంతో.. గామిని ఆ డేట్ కి తీసుకు వచ్చేస్తున్నారు.