Kamal Haasan : కమల్ హాసన్, శృతిహాసన్ కాంబినేషన్‌లో.. లోకేష్ కానగరాజ్ సినిమా రాబోతోందా..!

కమల్ హాసన్, శృతిహాసన్ కాంబినేషన్ లో లోకేష్ కానగరాజ్ ఓ సినిమా తీసుకు రాబోతున్నారా. ఈ కాంబినేషన్ నిజంగానే సెట్ అవుతుందా..?

Kamal Haasan : కమల్ హాసన్, శృతిహాసన్ కాంబినేషన్‌లో.. లోకేష్ కానగరాజ్ సినిమా రాబోతోందా..!

Kamal Haasan Shruti Haasan in Lokesh Kanagaraj direction news gone viral

Updated On : February 8, 2024 / 7:15 AM IST

Kamal Haasan : లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన ‘విక్రమ్’ ఎంతటి సూపర్ హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. కమల్ అభిమాని అయిన లోకేష్.. తన హీరోని బీస్ట్ మోడ్ లో చూపించి తన తోటి అభిమానులను ఫుల్ ఖుషీ చేశారు. కాగా ఆ మూవీకి సీక్వెల్ ఉందంటూ ఆల్రెడీ ప్రకటించారు. దీంతో అభిమానులంతా ఆ సీక్వెల్ ఎప్పుడు మొదలవుతుందని ఎదురు చూస్తున్నారు.

ఇది ఇలా ఉంటే, రీసెంట్ గా ఓ న్యూస్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. లోకేష్ కానగరాజ్, శృతిహాసన్ కి సంబంధించిన ఓ ఫోటో బయటకి రావడంతో.. ఈ టాపిక్ మొదలయింది. కమల్ హాసన్, శృతిహాసన్ కాంబినేషన్ లో లోకేష్ కానగరాజ్ ఓ సినిమా తీసుకు రాబోతున్నారన్నది.. ఆ టాపిక్ సారాంశం. ఇక ఈ వార్త అభిమానుల్లో క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. మరి ఈ కాంబినేషన్ నిజంగానే సెట్ అవుతుందా..?

Also read : Tillu Square : టిల్లు స్క్వేర్ నుండి బర్త్ డే బాయ్ సిద్దూ కోసం గ్లింప్స్ రిలీజ్

ఈ వార్త పై కొందరు చెబుతున్న సమాచారం ఏంటంటే.. ఆ ఫోటో ఒక ప్రమోషనల్ సాంగ్ కి సంబంధించినది అని చెబుతున్నారు. శృతిహాసన్ మంచి సింగర్ అన్న విషయం అందరికి తెలిసిందే. ర్యాంప్ సాంగ్స్ తో ఆడియన్స్ ని ఉర్రూతలూగిస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు కమల్ కోసం నిర్మాణ సంస్థ అయిన RKFI ప్రొడక్షన్స్ కి సంబంధించిన ఓ ప్రమోషనల్ సాంగ్ ని శృతిహాసన్ పాడగా, దానిని లోకేష్ డైరెక్షన్ లో పిక్చరైజేషన్ చేస్తున్నారట.

ఇక లోకేష్ సినిమాల విషయానికి వస్తే.. రజినీకాంత్‌తో తన తదుపరి ప్రాజెక్ట్ ని చేయబోతున్నారు. ప్రస్తుతం లోకేష్ కానగరాజ్.. ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుతున్నారు. ‘లియో’ సినిమా విషయంలో వచ్చిన ఫీడ్ బ్యాక్ ని దృష్టిలో పెట్టుకొని రజిని సినిమాని చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ పట్టాలు ఎక్కనుంది. ఈ సినిమా తరువాత ఖైదీ 2, రోలెక్స్, విక్రమ్ 2, లియో 2 సినిమాలు లైనప్ లో ఉన్నాయి.