Pawan Kalyan : పవన్ కళ్యాణ్ అనే యువకుడు హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కుతున్న సినిమా ‘పురుష:’. కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బత్తుల కోటేశ్వరరావు నిర్మాణంలో వీరు ఉలవల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. వీరు ఉలవల గతంలో మళ్లీ రావా, జెర్సీ, మసూద.. లాంటి పలు సూపర్ హిట్ సినిమాలకు సహాయ దర్శకుడిగా పని చేసారు.(Pawan Kalyan)
ఈ సినిమాలో వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్, వెన్నెల కిషోర్, వి.టి.వి.గణేష్, అనంత శ్రీరామ్, పమ్మి సాయి, మిర్చి కిరణ్, గబి రాక్, అనైరా గుప్తా.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైన్మెంట్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.
Also Read : Janasena : టాలీవుడ్ నిర్మాతకు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చిన జనసేనాని.. ఆ సినిమా క్యాన్సిల్..?
తాజాగా ఓ స్పెషల్ సాంగ్ తో ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్టు నేడు దసరా రోజు ప్రకటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కొత్త హీరో అయినా బాగా నటించాడని మూవీ యూనిట్ అంటుంది. మరి పవన్ కళ్యాణ్ పేరు పెట్టుకొని ఇతను ఎలా మెప్పిస్తాడా చూడాలి. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించనున్నారు.