Pawan Kalyan OG Shoot in Mumbai Photos and Video Leaked
Pawan Kalyan : పవన్ రాజకీయాల బిజీతో ఇన్నాళ్లు సినిమాలు ఆలస్యం అయిన సంగతి తెలిసిందే. కానీ ఇటీవల ఒక సంవత్సరం లోపు చేతిలో ఉన్న సినిమాలు అన్ని పూర్తిచేస్తానని నిర్మాతలకు మాట ఇవ్వడంతో వరుసగా షూటింగ్స్ కి డేట్స్ ఇస్తున్నాడు. హరిహర వీరమల్లు షూట్ పూర్తిచేసి జూన్ 12 రిలీజ్ కి రెడీ చేసారు. ఇక పవన్ భారీ హైప్ ఉన్న OG సినిమా షూట్ లో బిజీగా ఉన్నారు.
DVV ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సుజీత్ దర్శకత్వంలో OG సినిమాని తెరకెక్కిస్తున్నారు. గ్యాంగ్ స్టర్ డ్రామాగా ముంబై బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతుంది. ఇప్పటికే రిలీజయిన ఒక్క గ్లింప్స్ తోనే OG సినిమాపై హైప్ ఆకాశాన్నంటింది. ఫ్యాన్స్ అంతా పవన్ కళ్యాణ్ ఎక్కడ కనపడినా OG OG అని అరుస్తున్నారు. ఈ సినిమాకు పవన్ ఓ 20 రోజులు డేట్స్ ఇస్తే షూట్ అయిపోతుంది.
దీంతో పవన్ తాజాగా OG సినిమాకు డేట్స్ ఇచ్చాడు. ముంబైలో OG సినిమా షూట్ జరుగుతుంది. ముంబైలో షూట్ గ్యాప్ లో పవన్ బయటకు వచ్చి వెహికల్ ఎక్కుతుండగా వీడియో, ఫొటోలు లీక్ అయ్యాయి. పవన్ బెల్ బాటమ్ ప్యాంట్ వేసుకొని, టక్ చేసి OG లుక్ లో కనపడ్డాడు. దీంతో ఈ వీడియో, ఫొటోలు వైరల్ గా మారాయి. త్వరగా పవన్ ఈ సినిమా పూర్తి చేస్తే చెప్పిన డేట్ కి సెప్టెంబర్ 25న ఈ సినిమా వస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
#OG on the streets of Mumbai.
A good man has fans wherever he goes in the world.
Pawan Kalyan is very handsome in #OG movie. The style and aura is next level.
At the time of release of this movie, the hype of this movie is not comparable to any other movie in the country. pic.twitter.com/3bLjJNmzaO
— ShivaniSS (@ShivaniSS143) May 28, 2025